ఎక్కడో విన్నట్లుందే.. ఈ పేరును అంటారా? రోజువారీ రాజకీయాల్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యే వారికి ‘శ్రీకళారెడ్డి’ పేరు విన్నంతనే ఇలాంటి భావన కలగటం ఖాయం. ఇంట గెలవటం ఎవరైనా చేస్తారు. కానీ.. రచ్చ గెలవటం అంత ఈజీ కాదు. ఎన్నికలన్నంతనే ఎన్నో ఇష్యూలు.. భావోద్వేగాలు ఉంటాయి. దక్షిణాదివారంటే చాలు.. ఉత్తరాది వారికి కాస్తంత చిన్నచూపు అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది.. ఉత్తరాదిన జరిగిన స్థానిక ఎన్నికల్లో దక్షిణాదికి చెందిన ఒక మహిళ విజయం సాధించటం.. కీలక స్థానాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో కీసర శ్రీకళారెడ్డి తన సత్తా చాటారని చెప్పాలి.
ఇటీవల యూపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటటం తెలిసిందే. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ.. బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం యూపీ మీదనే ఫోకస్ పెట్టిన సందర్భంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటం కమలనాథులకు కొత్త హుషారుగా మారింది. ఇటీవల మోడీ ప్రభ తగ్గిందని.. ఆ కారణంగా బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న మాట వినిపిస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదన్నట్లుగా యూపీ స్థానిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. ఆ పార్టీ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
అదే సమయంలో.. తమకు మంచి రోజులు వచ్చినట్లేనని భావించిన విపక్షాలకు తాజా ఫలితాలు షాకింగ్ గా మారాయి. అయితే..ఈ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరగటం తెలిసిందే. ఇక్కడే బీజేపీ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించిందని సమాజ్ వాదీ కీలక నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారంతా తమ పార్టీకి చెందిన వారేనని.. విజయం సాధించిన తర్వాత వారంతా తమ వాళ్లేనని బీజేపీ క్లెయిం చేస్తుందన్న మాటను ఆయన చెబుతున్నారు. ఈ విషయాల్ని కాస్త పక్కన పెట్టి.. కీసర శ్రీకళారెడ్డి ఎవరు? ఆమె పేరు ఎక్కడ? ఏ సందర్భంలో విన్నాం? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? తాజాగా ఆమె సాధించిన విజయం ఏమిటన్న విషయాల్ని తెలుసుకుంటే ఆసక్తికరంగా అనిపించక మానదు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి అంటే చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు. రెండేళ్ల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేయగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి 56.34 శాతం ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి 34.74 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున డాక్టర్ కోట రామారావు పోటీ చేశారు.
నిజానికి ఆయనకు బదులుగా శ్రీకళారెడ్డిని బరిలోకి దింపుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. అక్కడెక్కడో యూపీలో ఉన్న ఆమెను హుజురాబాద్ కు ఎందుకు తీసుకొస్తారంటే.. ఆమె బ్యాక్ గ్రౌండ్ అలాంటిది. ఆమె తండ్రి జితేందర్ రెడ్డి 1972లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అది కూడా.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ గెలిచారు. ఇలా ప్రజల్లో క్రేజ్ ఉన్న జితేందర్ రెడ్డి కుమార్తెను బీజేపీ తరఫున బరిలోకి దింపితే ఆమె సత్తా చాటటమే కాదు.. తెలంగాణలో తమ పార్టీ ఉనికిని ప్రదర్శించినట్లు అవుతుందన్న అంచనాలు వినిపించాయి.
అయితే.. యూపీలో సెటిల్ అయిన ధనుంజయ్ ను పెళ్లాడారు. ధనుంజయ్ గతంలో ఎంపీగా పని చేశారు. ఇలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆమె రాజకీయంగా తన సత్తా చాటాలన్న ఉత్సాహంలో ఉంటారని చెబుతారు. దీనికి తోడు సామాజిక సేవా కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేస్తారన్న పేరుంది. దీంతో.. ఆమెను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయటానికి కసరత్తు జరిగినా.. ఆమె ఆసక్తి చూపించలేదు. దీంతో ఆమె బరిలోకి దిగలేదు.
ఇదిలా ఉంటే.. బీజేపీలో యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించారు. జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆమె.. తాజాగా జాన్పూర్ పరిషత్ ఛైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. ఇలా రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఎట్టకేలకు జాన్పూర్ పరిషత్ ను సొంతం చేసుకోగలిగారు. ఒక తెలుగుమ్మాయిగా సవాళ్లతో కూడుకున్న రాజకీయ రంగంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో విజయం సాధించిన తన సత్తాను చాటుకోవటం నిజంగా అభినందించాల్సిన విషయమే.