హైద‌రాబాద్ లో 'ప‌రువు' ఆత్మ‌హ‌త్య‌!

Update: 2018-09-20 12:20 GMT
మిర్యాల‌గూడ‌లో దారుణ హ‌త్య‌కు గురైన ప్ర‌ణ‌య్ ఉదంతం.....నిన్న హైద‌రాబాద్ లోని ఎర్ర‌గ‌డ్డ‌లో సందీప్ - మాధవి ల‌పై హ‌త్యాయ‌త్నం....తీవ్ర క‌ల‌కలం రేపిన సంగతి తెలిసిందే. త‌న తండ్రి చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ మాధ‌వి వెంటిలేట‌ర్ పై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. ఈ రెండు ఉదంతాలు మ‌రువ‌క ముందే అదే త‌ర‌హాలో మ‌రో దుర్ఘ‌ట‌న జ‌రిగింది. అమ్మాయి త‌ల్లిదండ్రుల ప‌రువు కాటుకు మ‌రో యువ‌కుడు బ‌ల‌య్యాడు.  ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌న భార్య‌ను ఆమె త‌ల్లిదండ్రులు బ‌ల‌వంతంగా తీసుకు వెళ్లార‌ని శ్రీ‌కాంత్ అనే యువ‌కుడు ఆత్మ‌హత్య చేసుకున్నాడు.  బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీ‌కాంత్....నేడు ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చ‌నిపోయే ముందు శ్రీ‌కాంత్ తీసుకున్న‌ సెల్ఫీ వీడియోలో ..త‌న చావుకు గ‌ల కార‌ణాలు చెప్పాడు.

హైదరాబాద్‌ కు చెందిన శ్రీకాంత్ - నల్గొండకు చెందిన శ్రీహర్షలు ప్రేమించుకున్నారు. అయితే, శ్రీ‌కాంత్ వేరే కులానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో వీరి పెళ్లికి శ్రీ‌హ‌ర్ష త‌ల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో, వారిద్ద‌రూ 2015లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే, పోలీస్ డిపార్టుమెంటులో పని చేస్తున్న శ్రీ‌హ‌ర్ష తండ్రి...ఆమెను బ‌ల‌వంతంగా తీసుకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమెకు అబార్ష‌న్ కూడా చేయించిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం. ఈ వ్య‌వ‌హారాల‌తో పాటు శ్రీ‌హ‌ర్ష‌ను వ‌దిలేయాల‌ని ఆమె కుటుంబ‌స‌భ్యులు శ్రీ‌కాంత్ పై ఒత్తిడి చేశారు. దీంతో, బుధ‌వారం సాయంత్రం శ్రీ‌కాంత్...ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఉస్మానియాలో చికిత్స్ పొందుతోన్న శ్రీ‌కాంత్....నేడు మృతిచెందాడు. సూసైడ్ కు ముందు శ్రీ‌కాంత్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో ....త‌న‌ను శ్రీ‌హ‌ర్ష తండ్రి పలుమార్లు బెదిరించార‌ని వెల్ల‌డించాడు.

త‌న భార్య శ్రీ‌హ‌ర్ష‌ - ఆమె తల్లిదండ్రులు త‌న‌ను వేధించార‌ని శ్రీ‌కాంత్ తెలిపాడు. కట్టుబట్టలతో వచ్చిన భార్యను తాను అపూరుపంగా చూసుకున్నాన‌ని, కానీ, తనకు చివరకు వేధింపులే మిగిలాయని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌న చావుకు కారణం త‌న భార్య శ్రీహర్ష - ఆమె త‌ల్లిదండ్రులు - తమ్ముడు - అక్క అని చెప్పాడు. తామిద్ద‌రం ప్రేమించి పెళ్లి చేసుకున్నామ‌ని - కానీ, త‌న‌ భార్యకు చట్టవ్యతిరేకంగా అబార్షన్ చేయించారని చెప్పాడు. అంతేకాకుండా, త‌న‌పై, త‌న‌ కుటుంబ సభ్యులపై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని అన్నాడు. త‌మ‌కు ఎక్కడా న్యాయం జరగకుండా వాళ్ల బంధువులు పోలీసులు అడ్డుప‌డ్డార‌ని పేర్కొన్నాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News