'విత్తనాల పంపిణీలో మరీ తీవ్రమైన సమస్యలు ఏమీ లేవు. మేం ఎలాంటి రహస్య జీవోలూ ఇవ్వడం లేదు. వంద కోట్ల రూపాయల పై స్థాయి విలువైన ప్రతి అంశం గురించి కూడా జ్యూడీషియల్ కమిటీకి తెలియజేసే ఉత్తర్వులు జారీ చేస్తామని ఇది వరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అయినా బురద జల్లే ప్రయత్నాలు చేయడం తగదు..' అని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత - చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
శాసనసభ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించడంపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఆ కార్యక్రమం బాగా జరిగిందన్నారు. దానికి తెలుగుదేశం పార్టీ హాజరు కాకపోవడం పై స్పందించారు. ఆ కార్యక్రమానికి టీడీపీ సభ్యులు కూడా హాజరు కావాల్సిందని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక లోకేష్ వరస ట్వీట్లపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఏదైనా ఉంటే ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలని లోకేష్ కు హితబోధ చేశారు శ్రీకాంత్ రెడ్డి. ఆయన ట్వీట్ చేస్తే దానికి ఫాలో అయిపోయి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
లోకేష్, బుద్ధా వెంకన్న లాంటి వాళ్లకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారు బురదజల్లే కార్యక్రమాలు మాత్రమే చేస్తుంటారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.