ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని... మూడు పంటలు పండే రాజధాని ప్రాంతంలో ముప్పు ఎదురు కానుందని చెబుతూ రాజధాని అమరావతికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జర్నలిస్టు శ్రీమన్నారాయణకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ క్లాస్ పీకింది. అమరావతికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చస్తూ శ్రీమమన్నారాయణ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచరాణ సందర్భంగా ట్రైబ్యునల్ ఆయనకు ఓ విషయంలో చీవాట్లు పెట్టింది. అంతేకాదు... క్షమాపణలు కూడా చెప్పాలని సూచించింది.
ఇంతకూ విషయం ఏంటంటే... అమరావతి వ్యతిరేక పోరాటంలో విరాళాలు కావాలంటూ శ్రీమన్నారాయణ ఫేస్ బుక్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ట్రైబ్యునల్ దానికి అభ్యంతరం తెలిపింది. ప్రచారం కోసం పాకులాడరాదంటూ సూచించింది. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదేశించడంతో శ్రీమన్నారాయణ ట్రైబ్యునల్ కు క్షమాపణ చెప్పారు.