శ్రీ‌నివాసమ‌యంగా మారిన ఏపీ అసెంబ్లీ!

Update: 2019-05-30 05:47 GMT
త్వ‌ర‌లో కొలువు తీర‌నున్న ఏపీ అసెంబ్లీలో సిత్ర‌మైన ప‌రిస్థితి ఒక‌టి ఎదురు కానుంది. తెలుగు నేల మీద శ్రీ‌నివాసు.. వెంటేశ్వ‌ర్లు అన్న పేర్ల‌కు కొద‌వ ఉండ‌దు. అయిన‌ప్ప‌టికీ.. అసెంబ్లీలో పెద్ద మొత్తంలో శ్రీ‌నివాసులు.. వెంక‌టేశ్వ‌ర్లు ఉన్నది లేదు. అందుకు భిన్నంగా తాజాగా ఏపీ అసెంబ్లీలో భారీ ఎత్తున శ్రీ‌నివాసులు ఉండ‌నున్నారు.

స‌భ‌లో ఎవ‌రైనా గ‌ట్టిగా శ్రీ‌నివాస్ అని పిలిస్తే.. త‌క్కువ‌లో త‌క్కువ డ‌జ‌న్ మంది శ్రీ‌నివాసులు నన్నేనా పిలిచింది? అంటూ క్వ‌శ్చ‌న్ వేయ‌క‌మాన‌రు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలుండే ఏపీ అసెంబ్లీలో ఈసారి ఏకంగా 13 శ్రీ‌నివాస‌రావులు ఎన్నిక‌య్యారు.

దీంతో.. ఏపీ అసెంబ్లీ శ్రీ‌నివాసమ‌యంగా మారిన ప‌రిస్థితి. మ‌రి.. ఇంత మంది శ్రీ‌నివాసుల్ని ఎలా గుర్తు పెట్టుకుంటారో.. ఒక‌రిని పిలిస్తే మ‌రొక‌రు స్పందించ‌కుండా ఉండేందుకు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారన్న‌ది ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి. ఇక‌.. ఈసారి స‌భ‌కు ఎన్నికైన శ్రీ‌నివాసుల చిట్టా చూస్తే..

+  కె.శ్రీనివాసరావు (ఎస్‌.కోట),

+  ముత్తంశెట్టి శ్రీనివాసరావు(భీమిలి)

+  గంటా శ్రీనివాసరావు (విశాఖ)

+  చెల్లుబోయిన శ్రీనివాస్‌ (రామచంద్రపురం)

+   జి.శ్రీనివాసనాయుడు(నిడదవోలు)

+   గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం)

+   పుప్పాల శ్రీనివాసరావు (ఉంగుటూరు)

+   ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్(ఏలూరు)

+  వెల్లంపల్లి శ్రీనివాసరావు(విజయవాడ వెస్ట్‌)

+   గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నర్సరావుపేట)

+   బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)

+  కె.శ్రీనివాసులు (కోడూరు)

+  ఆరణి శ్రీనివాసులు(చిత్తూరు)
Tags:    

Similar News