క‌త్తులు క‌ట్ట‌టంలో ఆ తండ్రీ కొడుకులకు మంచిపేరుందా?

Update: 2018-10-26 06:59 GMT
పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాస్పంద‌న చూసి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు క‌న్నుకుట్టిందా?  జ‌రిగిన ఉదంతంలో త‌మ పాత్ర ఏమీ లేద‌ని చెప్పుకునేందుకు ప్ర‌ద‌ర్శిస్తున్న అత్యుత్సాహం ఇప్పుడు ప్ర‌జ‌లంతా చీద‌రించుకునే ప‌రిస్థితి. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కోడి పందెల‌కు క‌ట్టే క‌త్తితో దాడి చేసిన శ్రీ‌నివాస‌రావుకు సంబంధించిన అంశాల్ని తెలుగు దేశం నేత‌లు చేస్తున్న ప్ర‌చారంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన ఘ‌ట‌న అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాలు మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌రంగా మారాయి. జ‌గ‌న్ పై దాడి చేసిన వ్య‌క్తి జ‌గ‌న్ అంటే వీరాభిమాని అని.. పాద‌యాత్ర సంద‌ర్భంగా భారీ ఫ్లెక్సీ క‌ట్టిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. శ్రీ‌నివాస‌రావు పెట్టిన‌ట్లుగా చూపిస్తున్న ఫ్లెక్సీ.. మార్ఫింగ్ చేసింద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన అంశంపై టీడీపీ నేత‌ల తీరు మొద‌ట్నించి సందేహంగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి. దాడి జ‌రిగిన వెంట‌నే.. టీడీపీకి చెందిన నేత‌లు ప‌లువురు శ్రీ‌నివాస‌రావు ఇంటికి వెళ్ల‌టం.. ఎంతో బాగా తెలిసిన అడ్ర‌స్ మాదిరి వ్య‌వ‌హ‌రించ‌టం ఒక ఎత్తు అయితే.. సోష‌ల్ మీడియా ద్వారా.. జ‌గ‌న్ వీరాభిమాని అని.. అత‌గాడు పాద‌యాత్ర సంద‌ర్భంగా పెద్ద ఫ్లెక్సీ క‌ట్టిన‌ట్లుగా చెబుతూ.. ఒక ఫోటోను వైర‌ల్ చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

కూటికి లేనోడు ఫ్లెక్సీ క‌డ‌తాడా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ‌గ‌న్‌కు అంత వీరాభిమానే అయితే.. పార్టీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వం ఎందుకు తీసుకోన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. జ‌గ‌న్ ను అంత‌గా అభిమానించే శ్రీ‌నివాస‌రావు పాద‌యాత్ర‌లో పాల్గొనాలి క‌దా?  అదెందుకు చేయ‌లేదు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

జ‌గ‌న్ మీద దాడికి పాల్ప‌డిన శ్రీ‌నివాస‌రావుకు చెందిన జిల్లా.. ప‌క్క జిల్లాలో దాదాపు రెండు నెల‌ల పాటు జ‌గ‌న్ పాద‌యాత్ర నిర్వ‌హించారు. జ‌గ‌న్ అంటే అంత వీరాభిమాని అయితే.. వేలాది మంది మాదిరే.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎందుకు పాల్గొన‌లేదు? అన్న‌ది ప్ర‌శ్న‌. వీటికి స‌మాధానాలు చెప్ప‌ని వారు.. దాడికి పాల్ప‌డిన నిందితుడు జ‌గ‌న్ కు వీర‌భ‌క్తుడ‌ని.. జ‌గ‌న్ కోసం ఫ్లెక్సీ క‌ట్టార‌న్న మాట‌ల్ని చెప్ప‌టంలో అర్థం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికైనా ఈ క‌ట్టుక‌థ‌ల్ని ప‌క్క‌న పెడితే మంచిద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిందితుడు శ్రీ‌నివాస్‌..  అత‌డి తండ్రి తాతారావులు ఇద్ద‌రు కోళ్ల‌కు క‌త్తులు క‌ట్ట‌టంలో మంచి అనుభ‌వం ఉంద‌ని చెబుతారు. కోళ్ల పందాల నిర్వ‌హ‌ణ విష‌యంలో ఎవ‌రు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది గోదావ‌రి జిల్లాల నేత‌ల‌కు బాగానే తెలుసు. అధికార‌పార్టీ నేత‌ల అండ‌దండ‌ల‌తోనే కోళ్ల పందాలు జోరుగా సాగుతాయ‌ని.. ఆ పార్టీ నేత‌లకు కోళ్ల‌పందాల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉంటాయ‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. మ‌రి.. ఇలాంటివేళ‌.. కోళ్ల పందాల‌కు వాడే క‌త్తిని వాడ‌టంలో అర్థ‌మేంది? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. మొత్తంగా చూస్తే.. కుట్ర కోణాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే వీరాభిమాని.. ఫ్లెక్సీ క‌ట్టుడు లాంటి విష‌యాల్ని తెగ ప్ర‌చారం చేస్తున్నార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News