న‌వ‌మి నాటి వైభ‌వం : విన‌రో భాగ్య‌ము రామ కథ

Update: 2022-04-10 09:30 GMT
న‌దిని దాటడం విధి స‌ముద్రాన్ని దాటడం యోగం
యోగంతో సాధ‌న అందుకే అది యోగ సాధ‌న అయింది
రామ త‌త్వ‌లో యోగ సాధ‌న ఉంది గొప్ప మార్పున‌కు అదే కార‌ణం
యుద్ధం ఎందుకు ఎవ‌రిపై అన్న విచ‌క్ష‌ణ జ్ఞానం కూడా ఉంది
లోకం పోక‌డ‌లు రామ‌య్య తండ్రికి కూడా అర్థం కాని సంద‌ర్భాలున్నాయా?
ఏమో ! మ‌రి! తిప్ప‌డు మాట‌లు విని భార్య ను వ‌దిలిలేడ‌యం త‌ప్పే క‌దా!

సృష్టిలో మంచి స్నేహాన్ని చూడాలంటే ముందు రామ క‌థ చ‌ద‌వాలి. భార్య ప్రేమించ‌డం నేర్చుకోవాలి అంటే రామ క‌థ‌ను నేర్చుకోవాలి. ప్రేమ అభిమానం స్నేహం ధ‌ర్మం ఈ నాలుగు పాదాల‌పై ఆయ‌న క‌థ న‌డిపారు. బోయ‌వాడే కానీ ఎంత గొప్ప క‌థ రాశాడో ఆ వాల్మీకి..అని అంతా స్మ‌ర‌ణీయం చేసుకునే రీతి ఆ క‌థ‌ది. అందుకు ఆ క‌థ‌ను మించిన క‌థ లేదు రాదు కూడా!

ఆద‌ర్శం ఒక చోట ఆగిపోకూడ‌దు. జీవితం అడ‌విలో దాగి ఉన్న వెన్నెల కాకూడ‌దు. సాధించాల్సినంత సాధించి విస్తృతి పొందాకే మ‌నం గొప్ప శిఖ‌రాల‌ను అందుకునేందుకు అవ‌కాశాలు ఉంటాయి. రామ క‌థ‌లో శిఖ‌రాలున్నాయి.. లోతులున్నాయి.. వంచ‌న ఉంది. ద్రోహం ఉంది.. న‌మ్మ‌కం ఉంది..లేనిదేది చెప్పండి.. పావన గోదావ‌రీ ప‌ర‌వ‌ళ్ల చెంత కొలువుదీరిన భ‌ద్రాద్రి రాముడే అన్నింటికీ మౌన సాక్షి.

తండ్రి మాట పాటింపును ప్రేమించ‌డంలో ఆద‌ర్శం ఉంది. మార‌డు తల్లి మాటను విన్న‌వించ‌డంలో ఆద‌ర్శం ఉంది. రావ‌ణుడు శ‌త్రువే కానీ ఆయ‌న‌ను గౌర‌వించ‌డంలో కూడా ఆద‌ర్శం ఉంది. యోధ గుణం ఒక్క‌టే రాజుకు ఉంటే స‌రిపోదు అని నిరూపించిన త‌త్వం ఒక‌టి ఉంది. మ‌న‌లో ఒక‌డు రాముడు అని నిరూపించిన త‌త్వం నిఖిల జ‌గ‌త్తులోనూ నిక్షిప్తం. క‌రుణ ఉంది.. ప్రేమ ఉంది.. ప్రేమ సంబంధ ప్ర‌తిపాద‌న‌ల్లో రామ‌త‌త్వం ఎంత గొప్ప‌ది. తోటి వారి ప్రేమ అయిన వారి అభిమానం గురువుల దీవెన ఇవ‌న్నీ రామ క‌థ‌కు ప్రాథ‌మిక సూత్రాలు. ఈ క‌థ‌ను మించి మ‌రో క‌థ లేదు రాదు రాకూడ‌దు కూడా!

బిడ్డ‌లంటే ప్రేమ ఉన్న తండ్రి.. భార్య అంటే విప‌రీతం అయిన గౌర‌వం ఉన్న భ‌ర్త.. క‌ల్యాణ రాముడు కౌస‌ల్య రాముడు..స‌క‌ల గుణ ధాముడు.. క‌రుణ‌కు ఆన‌వాలు అయిన దేవుడు..మ‌న‌కు కేవ‌లం రూపంలోనే గుర్తుకు వ‌స్తున్నాడు. నిరంత‌ర ఆచ‌ర‌ణ‌కు అత‌డొక నిత్య స్ఫూర్తి. తేజ‌రిల్లిన తేజ‌స్సు.. వెన‌క్కు త‌గ్గ‌ని ధీర గుణం.. ప్ర‌జల మాట‌కు  అనుగుణంగా పాల‌న ఇవ‌న్నీ ఇప్పుడు ఊహించ‌డం  సాధ్య‌మా? 
Tags:    

Similar News