తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో స్టాఫ్ నర్సుపై గ్యాంగ్ రేప్ వార్త తీవ్ర కలకలం రేపింది. సామూహిక అత్యాచారం చేసి ఆమెపై కొందరు దాడి చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. స్టాప్ నర్సుగా పనిచేస్తున్న యువతిపై ఆమె ప్రియుడు భాను.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని వార్తలు వెలువడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఎలికట్ట సమీపంలోని ఐరన్ ఫ్యాక్టరీ వెనుక నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. అయితే తాజాగా దీనిపై విచారించిన షాద్ నగర్ సీఐ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. నర్సుపై గ్యాంగ్ రేప్ జరిపినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపారు.
స్టాఫ్ నర్సుకు తెలియకుండా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చిన దుండగులు ఈ గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పు అని.. ఇలా ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని షాద్ నగర్ సీఐ శ్రీధర్ హెచ్చరించారు.
స్టాఫ్ నర్సు ప్రియుడు భాను తో పెళ్లి విషయంలో గొడవ జరిగిందని.. కులం విసయంలో ఇద్దరి కుటుంబాలకు మధ్య వివాదం నడుస్తోందని.. ఎల్లికట్ట వద్ద భానును కలిసి తిరిగే వెళ్లే సమయంలో నర్సు బైక్ పై నుంచి కిందపడినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ శ్రీధర్ తెలిపారు.
ఆమె ప్రస్తుతం సృహ తప్పి షాక్ లో ఉందని.. కోలుకున్నాక అసలు విషయాలు తెలుస్తాయని సీఐ తెలిపారు. ప్రియుడిని అదుపులోకి తీసుకున్నామని.. గ్యాంగ్ రేప్ జరిగలేదని తెలిసిందని సీఐ తెలిపారు.