తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అమ్మ జయలలిత ఆకస్మిక మృతితో అధికారపక్షంలోనే కాదు.. ప్రధాన ప్రతిపక్షంలోనూ మార్పులు చోటు చేసుకోవటం గమనార్హం. అమ్మ తర్వాత పార్టీ పగ్గాలు చిన్నమ్మ చేతికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక.. ప్రధానప్రతిపక్షమైన డీఎంకే పార్టీ పగ్గాల్నికొత్త సేనానికి అప్పగిస్తూ ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నారు.
చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. డీఎంకేకు కరుణానిధి తర్వాత స్టాలిన్ అధికారిక వారసుడన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైందని చెప్పొచ్చు. వాస్తవానికి డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు.. పేరుకు కరుణ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. పార్టీ.. ప్రభుత్వ బాధ్యతలన్నీ స్టాలిన్ చూస్తుండేవారు. కానీ.. అంతిమంగా రాజముద్ర మాత్రం కరుణది ఉండేది.
గడిచిన కొద్దికాలంగా కరుణానిధి అస్వస్థతతో ఉండటం.. పాలక అన్నాడీఎంకే అధినేత్రి జయ మరణంతో చోటు చేసుకున్న రాజకీయశూన్యత.. డీఎంకేను కాస్త అలెర్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు కరుణకు స్టాలిన్ ప్రత్యామ్నాయంగా చేయటం కోసం ఈ మార్పును చేశారనుకోవటం తప్పే అవుతుంది. కొద్దికాలం నుంచి పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న స్టాలిన్ తాజా ఎన్నిక ఏమీ ఆయన హోదాను మార్చేదేమీ ఉండదు. కాకుంటే.. కరుణ తర్వాత ఆయన స్థానం ఎవరిదన్న విషయంపై తాజా ఏకగ్రీవ ఎన్నిక మరింత క్లారిటీ ఇచ్చేసిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే.. డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్న మాట కేవలం లాంఛనమేనని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/