దాదాపు రెండు పుష్కరాల సమయం తర్వాత రజినీకాంత్ తమిళనాట రాజకీయ అరంగేట్రం చేస్తున్నామని ప్రకటించగానే ఆయన ఫ్యాన్స్ లో అభిమానం కట్టలు తెంచుకుంది. అదే సమయంలో తమిళనాడులో అధికార, ప్రతిపక్షాలైన అన్నాడీఎంకే, డీఎంకే లలో ఆందోళన మొదలైంది. రజినీకాంత్ సొంతంగా పార్టీ పెట్టి బరిలోకి దిగితే తమిళ రాజకీయాల్లో సునామీ ఖాయమని అంటున్నారు.
తాజాగా రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని.. అయితే రజినీకాంత్ పార్టీ పెట్టిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో మాట్లాడుతానని వ్యాఖ్యానించారు. రజినీకాంత్ పార్టీ ప్రకటించాక.. ఆయన సిద్ధాంతాలు, విధానాలు తెలుసుకొని అప్పుడు మాట్లాడుతానని స్టాలిన్ తెలిపారు.
రజినీకాంత్ రాజకీయ సలహాదారుపై మాత్రం స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు. తన రాజకీయ సలహాదారుగా తమిళరువి మణియన్ ను నియమించుకోవడంపై రజినీకాంత్ చింతిస్తున్నట్టు తెలిసిందని కౌంటర్ ఇచ్చారు. తమిళరువిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నానా అని రజినీకాంత్ పునరాలోచనలో పడ్డాడని అన్నారు.
తాజాగా రాజకీయ పార్టీ ఏర్పాటు, ఇతర కార్యాచరణ కోసం తమిళరువి మణియన్ ను రజినీకాంత్ నియమించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీ తర్వాత రజినీ చేసిన మొదటి నియామకం ఇదే. ఈ క్రమంలోనే స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.