తమిళనాడు లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం తో అన్ని పార్టీల కీలక నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్స్ వేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు నామినేషన్స్ వేయగా , తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కూడా నామినేషన్ వేసి , తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ప్రకటించారు. తనకు రూ. 2.24 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 4.94 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు. స్థిరాస్తులలో వ్యవసాయ భూమి, రెసిడెన్సియల్ భవంతులను చూపించారు. తన చేతిలో రూ. 50 వేల నగదు ఉందని తెలిపారు. ఇక , తన భార్య పేరిట రూ. 30,52,854 విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భార్యకు రూ. 24.77 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు.
ఎమ్మెల్యేగా వస్తున్న జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తనకు ఆదాయం వస్తోందని స్టాలిన్ చూపించారు. తనకు సొంత కారు లేదని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఎలాంటి బకాయిలు లేవని వెల్లడించారు. అటు-తన 2016 నాటి నామినేషన్ పత్రాల్లో స్టాలిన్.. తనకు 80. 33 లక్షల విలువైన చరాస్తులు, 3.33 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు.
స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన కూడా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ప్రకటించారు. తనకు రూ. 21.13 కోట్ల చరాస్తులు, రూ. 6.54 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని పొందుపరిచాడు. చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం నంచి ఈయన పోటీ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. ఈ పొత్తు కింద కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలకు పోటీ చేస్తోంది. 173 స్థానాలకు డీఎంకే తన అభ్యర్థులను ప్రకటించింది. పదేళ్ల అనంతరం తమిళనాడులో మళ్ళీ డీఎంకే అధికారం లోకి రావడానికి తహతహలాడుతోంది. ప్రస్తుతం అన్ని సర్వేలు కూడా డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పడం తో డీఎంకే నేతలు రెట్టింపు ఉత్సహం తో ప్రచారం సాగిస్తున్నారు.