ఎన్ని చెప్పినా మన సొసైటీలో హిపోక్రసీ ఎక్కువే. మద్యం సేవిస్తారు కానీ ప్రైవేటుగా.. కానీ పబ్లిక్ గా మాత్రం ఆ విషయం జనాలకు తెలియకూడదు. తెలిస్తే ఇమేజ్ పాడవుతుంది. నిజానికి మన ఇళ్ళల్లో కూడా సగం మందికి అలవాటు ఉంటుంది. కానీ ఆ సంగతి ఇంట్లో ఉండే మిగతా వారికి తెలీదు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీల విషయానికి వస్తే దాదాపు ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది. కానీ వీలైనంతగా దాన్ని పబ్లిక్ చేయకుండానే ఉంటారు. ఇక మద్యం దుకాణంలో సెలబ్రిటీలను చూడడం అనేది మాత్రం దాదాపు జరగదు.
కానీ రీసెంట్ గా అలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ టాలీవుడ్ స్టార్ హీరో హైదరాబాద్ లోని ఒక హైఫై ఏరియాలో స్టార్ హీరో నడుచుకుంటూ లిక్కర్ స్టోర్ లోకి వెళ్ళి తనకు కావాల్సిన మద్యం బాటిల్ ను తీసుకొని బిల్లింగ్ చేయించుకొని ఎంచక్కా కారెక్కి వెళ్ళిపోయాడట. సాధారణంగా ఇలా హీరోలు స్వయంగా వచ్చి మద్యం కొనుగోలు చేయడం జరగదు కాబట్టి అక్కడున్న వారు..స్టోరు ఓనరు జాయింటుగా నోరెళ్ళబెట్టారట. కానీ ఆ స్టార్ హీరో మాత్రం తొణకక బెణకక మీరు చేసేదే నేను చేస్తున్నాను అన్నట్టుగా చాలా సాధారణంగా ప్రవర్తించాడట.
దీంతో ఈ సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిందట. అంటే ఆ స్టార్ హీరో ఎంత మంచి నటుడైనా నిజ జీవితంలో నటించకుండా ఉండడానికి ట్రై చేస్తున్నట్టే. మనలాంటి జనాలకు స్క్రీన్ పై నటన రాదు కానీ నిజ జీవితంలో మాత్రం జాక్ నికొల్సన్.. టామ్ హ్యాంక్స్ లకు ఇండియన్ కజిన్స్ లాగా నటించేస్తుంటాం. రెండో ఆయన పేరు విన్నాం కానీ మొదటి పేరు తెలీదు అంటే మాత్రం ఇక మీకు గూగులమ్మే దిక్కు!