హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఉపఎన్నికలో గెలిచిన తర్వాత తన మద్దతుదారులతో మంగళవారం రాత్రి ఈటల కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజి నుండి కోర్టు చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. దాంతో కరోనా నిబంధనలను ఈటల ఉల్లంఘించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదుచేయటం విచిత్రంగా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉపఎన్నికలో ఈటల ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ ఉపఎన్నికే కేసీయార్ అహంకారం వల్ల వచ్చిందనే ఆరోపణలున్నాయి. మంత్రిగా బర్తరఫ్ చేసిన తర్వాత అనవసరంగా ఈటలను ర్యాగింగ్ చేయకపోతే ఎంఎల్ఏగా బహుశా రాజీనామా చేసేవారుకాదేమో. ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేయాలని మంత్రులు, టీఆర్ఎస్ ఎంఎల్ఏలు పదేపదే ఈటల వెంటపడటంతో వెంటనే ఆయన రాజీనామా చేసేశారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
ఉపఎన్నిక జరిగింది ఈటల-గెల్లు శ్రీనివాసయాదవ్ మధ్యే అయినా వాస్తవంగా మాత్రం కేసీయార్-ఈటల అన్నట్లుగానే జరిగింది. ఎలాగైనా ఈటలను ఓడించాలని కేసీయార్ విశ్వప్రయత్నాలు చేశారు. ప్రలోభాలు, ఒత్తిళ్ళు, పంపకాలు, పంపిణీలు, పదవులు ఇలా ఏది అందుబాటులో ఉంటే అదంతా చేశారు. ఇదే సమయంలో ఎలాగైనా ఉపఎన్నికలో గెలిచి కేసీయార్ అహంకారాన్ని దింపాలని ఈటల గెలుపుకోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ప్రజలు ఈటల వైపే నిలబడటంతో టీఆర్ఎస్ ఓటమి తప్పలేదు.
మరింతటి ఘన విజయం సాధించిన ఈటల విజయోత్సవ ర్యాలీ చేయటంలో ఆశ్చర్యం లేదు. నిజానికి కోవిడ్ నిబంధనలను ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు. లేకపోతే కేసీయార్ పాల్గొన్న బహిరంగ సభలకు అంతేసి జనాలు ఎలా హాజరయ్యారు ? అప్పుడు కోవిడ్ నిబంధనలు పోలీసులకు గుర్తురాలేదా ? మంత్రుల రోడ్డు షోలు, చిన్నపాటి సభలకు కూడా జనాలను చేశారు. అప్పుడెప్పుడూ పోలీసులకు కోవిడ్ నిబంధనలున్నాయన్న విషయం గుర్తురాలేదా ?
ఉపఎన్నికలో గెలిచి విజయోత్సవ ర్యాలీ చేసిన సమయంలోనే కోవిడ్ నిబంధనలు పోలీసులకు హఠాత్తుగా గుర్తుకొచ్చేసింది. ఒకవేళ టీఆర్ఎస్ గెలిచుంటే ఇంతకుమించిన ర్యాలీ నిర్వహించేవారే. మరప్పుడు కూడా కోవిడ్ నిబంధనలను చూపించి కేసులు పెట్టేవారేనా ? చూస్తుంటే ఈటల మీద ప్రభుత్వం కక్షసాధింపులు మొదలైనట్లే ఉంది. తనను ఢీకొని ఈటల గెలవటాన్ని కేసీయార్ తట్టుకోలేకపోతున్నట్లు అనుమానంగా ఉంది. అందుకనే ఈటలపై పోలీసులు కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసు నమో