విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా మారిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కుంటుతూ.. కిందపడుతూ.. పైకి లేస్తూ నడిచే ఏపీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన మరో కీలకాంశాన్ని కాగ్ వెల్లడించింది. గడిచిన రెండేళ్లుగా ఏపీ ఆదాయం ఎంతలా తగ్గిందో కళ్లకు కట్టినట్లుగా చెప్పింది.
తాజాగా కాగ్ రిపోర్టును ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సదరు నివేదిక ప్రకారం చూసినప్పుడు 2018-19తో పోలిస్తే.. 2019-2020, 2020-2021 మధ్య ఏపీ ఆదాయం తగ్గిన వైనాన్ని వెల్లడించింది.
సాధారణంగా ఏ రాష్ట్రానికైనా కేంద్రం నుంచి అటు రాష్ట్రం తనకు తానుగా ఆదాయాన్ని సమకూర్చుకునే విషయం తెలిసిందే. కాగ్ తాజా రిపోర్టు చూసినప్పుడు గడిచిన రెండు సంవత్సరాల్లో రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం.. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం తగ్గిన విషయాన్ని వెల్లడించింది.
గత రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గటానికి కారణం.. కోవిడ్ 19 తో పాటు విపత్తు వేళ విధించిన లాక్ డౌన్ ఆంక్షలతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గినట్లుగా పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా భారీగా తగ్గినట్లుగా పేర్కొంది. 2018-19తో పోలిస్తే 2019-2020లో రూ.4545 కోట్లు తగ్గినట్లుగా పేర్కొంది.
అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి.. ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకొని అనంతరం జగన్ అధికార పగ్గాలు చేపట్టిన మొదటి ఆర్థిక సంవత్సరంలోనే భారీగా తగ్గుదల నమోదు కావటం గమనార్హం. ఇదే విషయాన్ని కాగ్ తాజా నివేదిక స్పష్టం చేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని తగ్గటాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఏపీలోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ అలాంటి పరిస్థితే ఉంది. కారణం.. లాక్ డౌన్ విధించటం.. కరోనా విరుచుకుపడటం లాంటి వాటి కారణంగా ఆదాయం తగ్గటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. చంద్రబాబు పవర్లో ఉండి అనంతరం జగన్ అధికారాన్ని చేపట్టిన మొదటి సంవత్సరంలోనే ఆదాయం దాదాపు రూ.4545 కోట్లు తగ్గిపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. వ్యాట్ తో పాటు.. రిజిస్ట్రేషన్ల మీదా ఆదాయం తగ్గినట్లుగా గుర్తించారు. మరి.. దీనికి జగన్ సర్కారు ఏమని బదులిస్తుందో?