నిజంగా నిజం. ఈ ప్రపంచంలో బతికే హక్కు కేవలం సంపన్నులకు మాత్రమే ఉంటుందా? అంటే.. మరో మాటకు అవకాశం లేకుండా అవునని చెప్పేయొచ్చు. మీరేదో కమ్యునిస్టు అయి ఉంటారు. అందుకే మీ మాటలు ఇలా ఉన్నాయని అనుకోవచ్చు. కానీ.. అసలు విషయం తెలిస్తే.. ఇదెంత కఠిన వాస్తవమో తెలుస్తుంది. వ్యక్తుల స్థాయి నుంచి దేశాల స్థాయికి వస్తే.. సంపన్న దేశాలకు మాత్రమే ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నట్లు.. పేద దేశాలకు ఆ అవకాశమే లేదన్నట్లుగా వ్యవహరించే దుర్మార్గం చూస్తే నోట మాట రాదంతే.
పుస్తకాల్లోనూ.. సినిమాల్లోనూ చూపించేవి.. వాస్తవంలో చూసినప్పుడు విషయాలు ఎంత దారుణంగా ఉంటాయన్నది తాజా గణాంకాల్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చి కొద్ది నెలలు అవుతుంది. ఇప్పటికి కొందరికి.. అది కూడా ప్రభుత్వం పేర్కొన్న పరిమితులకు లోబడి మాత్రమే అందుబాటులోకి వస్తోంది. మరింత విషాదకరమైన విషయం ఏమంటే.. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే వ్యాక్సిన్లలో మన దేశ వాటా ఎక్కువే. కానీ.. వాటిని మన దేశంలో కంటే కూడా.. విదేశాలకే ఎగుమతి చేస్తున్న పరిస్థితి.
అది కూడా.. సంపన్న దేశాలకు మాత్రమే తప్పించి.. పేద దేశాలకు కాదు. ప్రపంచంలో 5 శాతం జనాభాకు మాత్రమే సరిపోయే టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా అత్యధికం సంపన్న దేశాల్లోనే పంపిణీ జరుగుతుందటం గమనార్హం. ఇప్పటివరకు తయారైన వ్యాక్సిన్లలో 40 శాతం టీకాలు కేవలం 27 సంపన్న దేశాల్లోనే వినియోగిస్తున్నారు. ఈ మొత్తం దేశాల జనాభా.. ప్రపంచ జనాభాలో కేవలం 11 శాతానికి మాత్రమే సమానం కావటం అసలైన విషాదం.
అదే సమయంలో అత్యంత పేద దేశాలకు లభించిన టీకాల వాటా కేవలం 1.6 శాతం. వ్యాక్సిన్ పంపిణీలో ఉన్న తేడాను ఈ గణాంకాలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయి. తాజాగా బ్లూమ్ బర్గ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం.. .అత్యధిక ఆదాయం ఉన్న దేశాలు.. పేద దేశాలతో పోలిస్తే పాతిక రెట్లు ఎక్కువగా టీకాలు వేశాయి.
ఇందుకు సరిపోయే చక్కటి ఉదాహరణను చెప్పాలంటే.. ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 4.3 శాతం మాత్రమే. కానీ.. ఆ దేశంలో వ్యాక్సినేషన్ ఎంత జరిగిందో తెలుసా? అక్షరాల 24 శాతం. అదే సమయంలో దాయాది పాకిస్థాన్ విషయాన్నే తీసుకుంటే.. ఆ దేశ జనాభా ప్రపంచంలో 2.7 శాతం మాత్రమే. ఆ దేశంలో ఇప్పటివరకు టీకాలు లభించింది ఎంతమందికో తెలుసా? కేవలం 0.1 శాతం మందికే. పాకిస్థాన్ మనకు శత్రు దేశమే కావొచ్చు.
వ్యాక్సిన్ వినియోగంలో అసమానతలు కళ్లకు కట్టేలా ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అంతదాకా ఎందుకు.. మన విషయానికే వద్దాం. వ్యాక్సిన్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న మనం.. మన ప్రజల కోసం వినియోగిస్తున్న దాని కంటే విదేశాలకు ఎగుమతి చేయటమే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే వీలుంది. కారణం.. సంపన్న దేశాలు తమ దేశ ప్రజలకు మరింత ముమ్మరంగా వ్యాక్సిన్లు వేయాలని భావించటమే.
అగ్ర రాజ్యమైన అమెరికా సంగతే చూద్దాం. రానున్న మూడు నెలల వ్యవధిలో తమ జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సిన్లు వేయాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది కూడా. అదే సమయానికి ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు.. అప్పటికి ఒక్క శాతం జనాభాకు కూడా వ్యాక్సిన్లు వేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఈ భూమి మీద బతికే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందో?