అర్ధశతాబ్ధం కిందట కనిపించకుండా పోయినా పార్వతీదేవి విగ్రహం అమెరికాలో గుర్తింపు
మన వజ్రాలు, వైఢూర్యాలు, దేవాలయాల్లోని విలువైన బంగారం, దేవతా విగ్రహాలన్నింటిని దోచుకుపోయారు. నాటి మొఘల్ స్రామజ్యపు రాజులు.. ఇతర దేశాల వారు దాడులు చేసి తీసుకెళ్లిపోయారు.
బ్రిటీష్ వారి చేతుల్లోకి వెళ్లాక కూడా ఈ దోపిడీ కొనసాగింది. అలాంటి ఎన్నో విలువైన కళాఖండాలు ఇప్పుడు వివిధ దేశాల్లో అగుపిస్తున్నాయి.
తమిళనాడులోని కుంభకోణంలో నాదన్ పురేశ్వర్ శివన్ ఆలయంలో 50 ఏళ్ల కిందట పార్వతీదేవి విగ్రహం మాయమైంది. ఇన్నాళ్లకు ఆ విగ్రహం ఆచూకీ లభ్యమైంది. అర్ధశతాబ్ధం తర్ాత అమ్మవారి విగ్రహాన్ని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో గుర్తించారు. ఈ మేరకు తమిళనాడు సీఐడీకి సమాచారం అందింది.
కాగా దీనిపై 1971లోనే ఈ కేసు నమోదైంది. 2019లో మరో వ్యక్తి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ పోలీసులు విగ్రహాల విభాగం చురుకుగా రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తును నడిపించిన సీఐడీ విగ్రహాల విభాగం ఇన్ స్పెక్టర్ ఎం. చిత్ర ఎంతో పరిశోధన సాగించి విగ్రహం ఆచూకీ కనిపెట్టడంలో విజయం సాధించారు.
చోళుల కాలం నాటి పార్వతీదేవి విగ్రహాల గురించి మ్యూజియంలలోనూ, విదేశాల్లోని వేలం విక్రయ సంస్థల్లోనూ శోధించారు. ఆమె కృషి ఫలించి , వారు వెదుకుతున్న పార్వతీదేవి విగ్రహం న్యూయార్క్ లోని బోన్హామ్స్ వేలం సంస్లో ఉన్నట్టు గుర్తించారు.
రాగి మిశ్రమంతో తయారైన ఈ విగ్రహం ఖరీదు రూ.1.6 కోట్లు ఉంటుందని అంచనా.. ఇది 12వ శతాబ్ధానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.