టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మ్యూజియంలో ఫుట్‌బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో -లియోనెల్ మెస్సీ, ఫార్ములా 1 డ్రైవర్ లూయిస్ హామిల్టన్ , ఇతర ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి.
విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం అధికారిక భారతీయ పరిమిత ఓవర్ల కిట్ డ్రెస్ లో తీర్చిదిద్దారు. కోహ్లీ విగ్రహం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే అభిమానులు భారత కెప్టెన్ ను అభినందిస్తూ హృదయపూర్వక సందేశాలను పోస్ట్ చేశారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
"ఇప్పుడు, దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్‌లో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం నెలకొల్పారు. గ్లోబల్ సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం దక్కింది” అని ఒక అభిమాని పోస్ట్ చేశారు. "ఒక ఫ్రేమ్‌లో మూడు గోట్స్! దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మరియు లియోనెల్ మెస్సీల మైనపు విగ్రహాలు” అని మరొకరు రాశారు.
ఈ టి20 ప్రపంచకప్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నారు. అతడి నాయకత్వానికి ఇదే చివరి పరీక్ష. ఇప్పటికే కెప్టెన్ గా ఇదే తన చివరి టోర్నమెంట్ అని కోహ్లీ ప్రకటించాడు. 2017 లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2019 ప్రపంచ కప్ - రెండు ప్రధాన ఐసిసి ఈవెంట్‌లలో కోహ్లీ టీమిండియాకు నాయకత్వం వహించాడు. టీ 20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా కోహ్లీ తొలి మ్యాచ్ అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో ఆడనున్నాడు.