గుడ్‌ న్యూస్‌: రెండోసారి క‌రోనా ముప్పు లేన‌ట్టే..

Update: 2020-05-03 04:10 GMT
ప్రాణాంతక కరోనా వైరస్ విష‌యంలో గుడ్‌ న్యూస్ వినిపించింది. ఇన్నాళ్లు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన వారికి రెండోసారి ‌కూడా వ‌స్తుంద‌ని చాలా అధ్య‌యనాలు వెల్ల‌డించాయి. అయితే అది అవాస్త‌వ‌మ‌ని క‌రోనా బాధితుల‌కు మ‌రోసారి ఆ వైర‌స్ రాద‌ని ఓ ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ వైరస్ అంటువ్యాధి కావ‌డంతో అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు. ఎందుకంటే తొలిసారి ఈ వైర‌స్ ఇంత తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. మ‌రోసారి ఆ వైర‌స్ వెలుగులోకి వ‌స్తే ప్ర‌పంచ‌మే ప్ర‌మాదంలో ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ నేప‌థ్యంలోనే రెండోసారి సోకితే ఎలా అని మ‌ద‌న‌ప‌డుతుండ‌గా.. అది వాస్త‌వ‌మా? క‌దా? అని కొన్ని సంస్థ‌లు అధ్య‌య‌నం చేశాయి. చివ‌రికి ఆ అధ్య‌య‌నంలో తేలిందంటే ఏంటంటే.. కరోనా ఒకసారి ఒక వ్యక్తికి సోకితే రెండోసారి మళ్లీ సోకదని శాస్త్ర‌వేత్త‌లు తేల్చేశారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ఇతరులకు కూడా కరోనా సోకదని స్ప‌ష్టం చేస్తున్నారు.

అయితే రెండోసారి క‌రోనా వైర‌స్ వ‌చ్చింద‌ని తేల‌డంలో వైఫ‌ల్యం.. త‌ప్పిదం జ‌ర‌గ‌డంతోనే ఆ విష‌యం ప్ర‌చారం.. వెలుగులోకి వ‌చ్చింద‌ని ద‌క్షిణ కొరియా శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. కరోనా వైరస్ బాధితులు వ్యాధిని అధిగమించిన తరువాత తిరిగి వచ్చినట్టు నమోదైన అనేక కేసుల్లో ప‌రీక్ష‌లు వైఫల్యం చెందాయ‌ని.. దీంతో త‌ప్పుడు స‌మాచారం వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. ద‌క్షిణ కొరియా వ్యాధి - నియంత్ర‌ణ (South Korean centre for disease control and prevention (CDC)కు చెందిన వారు ప‌రిశోధ‌న‌లు చేశారు. క‌రోనా వైరస్ మానవ శరీరంలోకి రియాక్టివేట్ (తిరగబడదు) కాలేదని స్ప‌ష్టం చేశారు.

ఒకసారి క‌రోనా బారిన ప‌డిన వారికి అవసరమైన రోగ నిరోధక శక్తి కలిగి ఉండదు.. అందుకే వైరస్ మ‌ళ్లీ త్వరగా తిరిగి వ్యాపిస్తుందనే వినిపించింది. అయితే దానికి వివ‌ర‌ణ ద‌క్షిణ కొరియా శాస్త్ర‌వేత్త‌లు ఇచ్చారు. జన్యుపరమైన విశ్లేషణలో కరోనా వైరస్ ఎలాంటి గణనీయమైన మార్పులను కలిగి ఉన్నట్టు గుర్తించలేదంట‌. కరోనాను జయించిన బాధితుల్లో ఎలాగో వైరస్ యాంటీ బాడీస్ ఉంటాయని తిరిగి పనిచేసేందుకు అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌గా.. అయితే యాంటీ బాడీస్‌ తోనే రోగ నిరోధ‌క శ‌క్తి పెరగ‌డానికి కార‌ణ‌మ‌వుతుందని ఆ శాస్త్ర‌వేత్త‌లు శాస్త్రీయంగా తెలిపారు. యాంటిజెన్ల కోసం రక్తాన్ని చెక్ చేయడానికి ఉపయోగించే పాలిమ‌ర్స్ చైయిన్ రియాక్ష‌న్ (polymerase chain reaction -) టెస్టు ఈ విష‌యం గుర్తించారు. వైరస్ అనుమానిత వ్యక్తిలో రెండోసారి కరోనా పాజిటివ్ అని తేలడం తప్పుగా పేర్కొన్నారు.
   

Tags:    

Similar News