కుప్పకూలిన మార్కెట్:నిర్మల ప్యాకేజీ పనిచేయలేదా?

Update: 2020-05-14 16:15 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ. ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించగానే షేర్ మార్కెట్ బుల్ రన్ తీయాలి. సెన్సెక్స్ రికార్డులు బద్దలు కొట్టాలి. నిఫ్టీ దూసుకెళ్లాలి.కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా తాజాగా లక్షల కోట్లతో మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే దేశీయ మార్కెట్ కుప్పకూలింది. దీన్నిబట్టి మోడీ ప్యాకేజీ వట్టి నీటి మూటలని మార్కెట్ పసిగట్టిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ఈ సాయంత్రం ఎంఎస్ఎంఈలు సహా వివిధ రంగాలకు ఇచ్చిన ప్యాకేజీ మార్కెట్లకు రుచించలేదు. దీంతో సెన్సెక్స్ 500కు పైగా పాయింట్ల నష్టంతో ప్రారంభమై దాదాపు 900 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిర్మల ప్యాకేజీ వట్టి నీటి మూట అని మార్కెట్ స్పష్టం చేసినట్టైంది.

మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విడతలవారీగా ప్రకటిస్తోంది. నిన్న సాయంత్రం నిర్మల ఎంఎస్ఎంఈలు, ఎన్బీఎఫ్సీ తదితరాలకు ప్యాకేజీలు ప్రకటించారు. అయితే భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ ఖర్చులు కనిపించడం లేదని మార్కెట్ కుప్పకూలింది. ఈ ప్యాకేజీతో ఉపశమనం లేదని.. మార్కెట్ కు భరోసాను ఇవ్వలేదని చెబుతున్నారు.

ఎంఎస్ఎంఈలు, ఎన్బీఎఫ్సీ లకు కలిపి రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కానీ ప్రభుత్వ వాస్తవ వ్యయం రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.1.9 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంటున్నారు. రుణాలు తీసుకోవడం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. అందుకే డైరెక్టుగా లాభించని ఈ ప్యాకేజీ వల్ల ఉపయోగం లేదని.. మార్కెట్ అందుకే కుప్పకూలిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Tags:    

Similar News