కేంద్రమంత్రి మీద సినిమా రేంజ్ లో దాడి !

Update: 2021-05-06 11:30 GMT
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుక్షణం నుండే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తలు కర్రలు, రాళ్లతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆయన తన పర్యటనను అర్థాంతరంగా కుదించుకున్నారు. ఈ వివరాలను మురళీధరన్ గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు.

పంచకుడిలోని స్థానికులు తన కాన్వాయ్‌ పై దాడి చేశారని, కార్ల అద్దాలను పగులగొట్టారని, తన వ్యక్తిగత సిబ్బందిని గాయపరిచారని మురళీధరన్  ట్విట్టర్ లో తెలిపారు. అలాగే , దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన విడుదల చేశారు. ఇది టీఎంసీ గూండాల పనేనని ఆరోపణలు చేశారు. ఈ ఘటన తో  తన పర్యటనను కుదించుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్‌ లో శాంతిభద్రతల పరిస్థితులపై గవర్నర్ జగ్‌దీప్ ధన్‌క ర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు.  బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుసగా హింస చోటుచేసుకోవడం పట్ల బెంగాల్ గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.




Full ViewFull View
Tags:    

Similar News