గడిచిన కొంతకాలంగా తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ విపక్షం బీజేపీ నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం.. అక్కడక్కడా చేతల యుద్ధం వరకు వెళ్లటం తెలిసిందే. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటానికి ఏ మాత్రం వెనక్కి తగ్గని వైనం రెండు పార్టీ శ్రేణులమధ్య ఉద్రిక్త పరిస్థితిని తీసుకొస్తున్నాయి. దీనిపై ఇరు పార్టీలు తమదైన వాదనను వినిపిస్తున్నాయి. తమ తప్పు లేదంటే తమ తప్పు లేదని పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా నిజామాబాద్ ఎంపీ కమ్ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్ కారుపై 200 మందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసినట్లు చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్ని సమీక్షించేందుకు వెళుతున్న ఆయనపై దాడి జరగటాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అర్మూర్ కు సమీపంలోని నందిపేట మండలం ఇస్సపల్లికి దగ్గర్లో ఈ దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. ఎంపీ అర్వింద్ కారుపైన రాళ్ల దాడి జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నంతనే బీజేపీ శ్రేణులు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
ఈ దాడిలో అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. తమ నేతపై దాడికి పాల్పడిన వైనంపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఆర్మూర్ లో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అభివృద్ధి పనుల్ని సమీక్షించటానికి వెళుతున్న తన కాన్వాయ్ కు అడ్డుగా రోడ్డు మీద టైర్లు కాల్చి వేశారని ఆరోపించారు.
తనపై దాడికి సంబంధించిన సమాచారాన్ని సీపీ.. ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారంతా ప్రేక్షక పాత్ర పోషించారని.. పోలీసులే దగ్గర ఉండి తమ వాహనాల మీద దాడి చేయించారంటూ అర్వింద్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై లోక్ సభ ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై జరిగిన రాళ్లదాడిని జాతీయ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళతానని చెప్పిన ఆయన మండిపడ్డారు. ఈ ఉదంతం ఇరు పార్టీల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితికి తెర తీసిందని చెబుతున్నారు.