మలద్వార స్వాబ్ పరీక్షలు ఆపండి ... చైనా పై జపాన్ అసంతృప్తి !

Update: 2021-03-02 10:30 GMT
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారితో అల్లాడిపోతోంది. కొన్ని కోట్లమంది ఇప్పటివరకు కరోనా భారిన పడ్డారు ..ఎంతోమంది కరోనా దెబ్బకి మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ నిర్ధార‌ణ కోసం ముక్కు మ‌రియు గొంతులో స్వాబ్స్ పెట్టి టెస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా చైనాలోని బీజింగ్ లో ఆన‌ల్ స్వాబ్ ( మలవిసర్జన ద్వారం ద్వారా శాంపిల్స్ తీసుకోవ‌డం ) ప్రారంభించారు.  పాయువులో వైరస్ ఎక్కువ రోజులు ఉంటుంది కాబ‌ట్టి. అనల్ టెస్టింగ్‌ లో తప్పుడు ప్రతికూలత వచ్చే అవకాశం లేద‌ని వీరి వాద‌న‌.

కొన్నిసార్లు జరిపే పరీక్షల్లో ఇన్ఫెక్షన్ ఫలితాలు మిస్ అయిపోవచ్చు. అదే ఎక్స్‌ట్రా ఆనల్ స్వాబ్ తీయడం వల్ల గుర్తించడం చాలా సులువు అవుతుందని బీజింగ్ యువాన్ హాస్పిటల్ లోని అసోసియేట్ డైరక్టర్ లీ టాంగ్ జెంగ్ అంటున్నారు.ఇతర దేశాల నుండి తిరిగి వచ్చిన ప్రజలకు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆన‌ల్ టెస్టింగ్ చేస్తున్నారు.

బీజింగ్ యువాన్ హాస్పిటల్, రెస్పిరేటరీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డిప్యూటీ డైరెక్టర్ లి టోంగ్‌ జెంగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముక్కు లేదా గొంతు పరీక్ష కంటే ఆన‌ల్ స్వాబ్ చాలా ప్రభావవంతంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. అయితే దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ఆన‌ల్ స్వాబ్ ద్వారా శాంపిల్ సేకరించిన తర్వాత పెయిన్ ఎక్కువగా వస్తుంది అని వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆన‌ల్ స్వాబ్ టెస్టింగ్ పై జాపన ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరు చేసే ఆన‌ల్ స్వాబ్ టెస్టు తో తమ దేశస్తులు ఎక్కువ పెయిన్ తో భాదపడుతున్నారు అని  ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొంది.
Tags:    

Similar News