మంత్రుల డ్రామా ఆపండ్రా ?

Update: 2022-04-09 09:24 GMT
ప‌ద‌వులు పోయిన త‌రువాత ప‌రాజితులుగా ఉన్న మంత్రులంతా మీడియా ద్వారా కూడా త‌మ లాబీయింగ్ ను షురూ చేస్తున్నారు. మంత్రులుగా ఉండి చేసిందేమీ లేక‌పోయినా క్యాస్ట్ ఈక్వేష‌న్ల ప‌రంగా త‌మ‌కెందుకు ప్రాధాన్యం ఇవ్వ‌రు అన్న విష‌యాన్ని వీరు ప‌ట్టుబ‌డుతున్నారు. ఆ విధంగా మ‌ళ్లీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కోసం పేర్ని నాని, కొడాలి నాని తాప‌త్ర‌య ప‌డుతున్నారు. అదేవిధంగా పెద్ది రెడ్డి లాంటివారిని త‌ప్పించి జూనియ‌ర్ల‌కు ఛాన్స్ ఇస్తే ఆయ‌న ఓర్వగల‌రా అన్న వాద‌న కూడా ఉంది. పెద్దిరెడ్డి, బొత్స లాంటి వారు త‌ప్పుకుని ఏం చేస్తార‌ని? ఆహా జిల్లాల‌కు పోయి పార్టీ ఆఫీసుల్లో  ప్రెస్మీట్లు పెడ‌తారా లేదా విలేక‌రులకు పెసరట్టు ఉప్మా పెట్టి మేం చెప్పిందంతా అక్ష‌రం పొల్లుపోకుండా రావాలి అని బుజ్జ‌గించి, పత్రిక‌ల్లో సానుకూల వార్త‌లు వ‌చ్చేలా చేసుకుంటారా? క‌నుక ప‌ద‌వులు పోయిన వారంతా ప‌రాజితులే! ఆయ‌న‌కు వారంతా అస‌మ‌ర్థులే ! నో డౌట్ ఇన్ ఇట్.

ఆంధ్రావ‌నిలో కొత్త క్యాబినెట్ ఏర్పాటుకు ముమ్మ‌ర స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ముహూర్తం కూడా ఫిక్స్ కావ‌డంతో అంతా ఆ రోసు కోస‌మే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 11న జ‌రిగే వేడుక‌కు ఎవరు విజేత‌గా వెళ్తారో,ఎవ‌రి ప‌రాజిత ఛాయ ఇంటికే ప‌రిమితం అయి ఉంటుందో అన్న‌ది తేలిపోనుంది. ముఖ్యంగా మంత్రుల ఎంపిక‌కు సంబంధించి నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వెళ్లినా వారంతా ఏడుపులు పెడ‌బొబ్బ‌లు పెడుతున్నారు.

మ‌రోవైపు త‌మ లాబీయింగ్ ను కూడా ఎక్క‌డా ఆపకుండా చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో మీడియాకు పెయిడ్ ప్యాకేజ్ రూపంలో డ‌బ్బులు ఇచ్చి వార్త‌లు కొన్ని ప్ర‌సారితం అయ్యేలా బులెటెన్ కొనుగోలు చేసేందుకు కూడా అత్యుత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా పేరున్న ఛానెళ్ల‌లో ఓ ప‌ది పేర్లు ప‌దే ప‌దే వ‌చ్చేలా చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి.

ప‌ద‌వి వ‌చ్చినా రాక‌పోయినా ఆఖ‌రి వ‌ర‌కూ పోరాటం చేశామ‌న్న వాద‌న కానీ సంకేతాలు కానీ జ‌నంలో వినిపించేందుకు మ‌రియు అదే స్థిరం అయ్యేందుకు ఇప్ప‌టి తాజా మాజీలు చేస్తున్న ప్ర‌య‌త్నాలే మీడియాకు నాలుగు డ‌బ్బులు తీసుకువ‌చ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకే కొన్ని ఛానెళ్లు వెబ్ కాస్ట్ చేస్తున్న‌వి టెలికాస్ట్ చేయ‌కుండా కూడా అతి తెలివి చూపుతున్నాయి.

కొన్ని టెలి కాస్ట్ అయిన‌వి మ‌ళ్లీ మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ ఇన్ లోకి వ‌చ్చేలా చేస్తున్నాయి. ఏదేమ‌యినా పేర్నినానికి, కొడాలి నానికి భావోద్వేగం ఆగ‌డం లేదు అని తెలుస్తోంది. ప్ర‌భుత్వ ప‌దవులు పోయినా వీరికి పార్టీ ప‌ద‌వులు ఇచ్చి క్యాబినెట్ ర్యాంకులు ఇస్తార‌న్న వాద‌న‌లు ఉన్నాయి.  అయినా కూడా వీరు త‌మ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నారు. పైకి జ‌గ‌న్ ఏం చెబితే అది చేస్తాం అని అంటున్నా జిల్లాల్లోకి వెళ్తే సీన్ ఆ విధంగా ఉండ‌దన్న సంగ‌తి వారికీ తెలుసు.

మంత్రులుగా ఉన్న‌ప్పుడు స‌చివాల‌యం కేంద్రంగా కొంత లాబీయింగ్ చేసి కొన్ని ప‌నులు మాత్రం చేయించుకోగ‌లిగారు. కానీ ఇప్పుడు అవి కూడా నెర‌వేర‌వు. అదేవిధంగా ఇదివ‌ర‌కు గౌర‌వం ఇప్పుడు ఉండదు. ఎలా చూసినా వారిని ప‌రాజితులుగానే చూస్తారు. అస‌మ‌ర్థులుగానే ప‌రిగ‌ణిస్తారు. ఈ నేప‌థ్యంలో పాత వాళ్లు రిపీట్ మోడ్ లో వ‌స్తే  సీనియ‌ర్లంతా తిరుగుబాటు చేసినా చేస్తారు. ప్ర‌స్తుతానికి నివురు గ‌ప్పిన నిప్పు మాదిరి అంతా ఉన్నారు అన్న‌ది ఓ వాస్త‌వం. అంగీక‌రించ‌దగ్గ నిజం ఇదే అని రాయాలి.
Tags:    

Similar News