అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శృంగార లీలలు ప్రపంచానికి తెలియంది కాదు. చక్కటి చుక్క భార్యగా ఇంట్లో ఉన్నా.. ట్రంప్ చూపులన్నీ ఎంత కక్కుర్తిగా ఉంటాయో.. మహిళల్ని ముగ్గులోకి దించటానికి అతగాడెంతగా ప్రయత్నిస్తారన్న ఉదాహరణలు ఇప్పటికి ఎన్నో బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో ట్రంప్ తో తమకున్న వివాహేతర సంబంధం గురించి ఓపెన్ గా చెప్పేశారు పలువురు మహిళలు.
వీరంతా ఒక ఎత్తు అయితే.. మాజీ పోర్న్ స్టార్ స్టామీ డానియెల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వేళ.. కీలక ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందు తనను హత్య చేస్తామంటూ చేయించిన బెదిరింపు మొదలు.. తనతో ట్రంప్ రిలేషన్ ఎలా స్టార్ట్ అయ్యిందన్న విషయంపై ఆమె ఓపెన్ అయ్యారు.
సీబీఎస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ ఆండర్సన్ కూపర్ కు ఆమె గంట పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
ట్రంప్ తో తనకున్న శారీరక సంబంధం గురించి బయటపెట్టకూడదని ట్రంప్ తనను బెదిరించాడని.. చంపుతామని హెచ్చరించిన వైనాన్ని తాను మర్చిపోలేనన్నారు. తమ రిలేషన్ షిప్ గురించి రహస్యంగా ఉంచాలన్న ఒప్పందం తమ మధ్య జరగలేదన్నారు. అయితే.. 2011లో ఒక మేగజిన్ కు తమ సంబంధంపై స్టోరీని తాను 15వేల డాలర్లకు అమ్మాలని తాను నిర్ణయించుకొని ఒప్పందం చేసుకున్నానని చెప్పారు.
ఈ విషయంలో ట్రంప్ నుంచి స్పందన వచ్చిందని.. తాను తన చంటిబిడ్డతో ఫిట్ నెస్ క్లాస్ కు వెళ్లేందుకు పార్కింగ్ లాట్ లో ఉన్న వేళ.. తన వెనుక ఒక వ్యక్తి వచ్చి ట్రంప్ గురించి వదిలేయాలని.. స్టోరీ మొత్తాన్ని మర్చిపోవాలన్నారు. లేనిపక్షంలో తన కూతురికి తల్లి లేని లోటు తెలుస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారన్నారు.
ఆ సందర్భంగా తాను వణికిపోయానని.. ఫిట్ నెస్ క్లాస్ కు వెళ్లలేదన్నారు. భయపడుతూ ఇంటికి వెళ్లినట్లు ఆమె చెప్పారు. ఇక.. ట్రంప్ తో తన రిలేషన్ ఎలా షురూ అయ్యిందో ఆమె చెబుతూ.. 2006లో తామిద్దరం కలిశామని.. అప్పుడు ట్రంప్ ఒక హోటల్ సూట్ లో ఉన్నారన్నారు. ఆ రోజే తామిద్దరం శారీరకంగా దగ్గరవ్వాలని అనుకున్నామని.. అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తి అని.. అసలు ఊహించలేరన్నారు.
హోటల్లో తనను చూసి వావ్.. నువ్వు అందంగా ఉన్నావని.. తెలివైనదానిలా కనిపిస్తున్నావని ట్రంప్ అన్నారని.. ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే శృంగారాన్ని చేసినట్లుగా ఆమె చెప్పారు. తన కంటే 30 ఏళ్లు పెద్దవాడైన ట్రంప్ తనను పెద్దగా ఆకర్షించలేకపోయినా.. తనతో శృంగారానికి వద్దని చెప్పలేదన్నాడు. అయితే.. తాను బాధితురాలిగా మిగల్లేదని.. తర్వాత కూడా తనతో ట్రంప్ టచ్ లో ఉన్నాడన్నారు.