సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరికి వారు.. తమకు తెలిసింది.. తాము నిజం అనుకున్నది పోస్ట్ చేసేయటం.. నిందలు.. ఆరోపణలు చేయటం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో పోస్టులను నమ్మటం ఈ మధ్యన తగ్గినా.. కొన్ని నమ్మకం కలిగేలా పోస్టులు పెట్టి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయిన ఒక ఉదంతం నిజం కాదని తేలిపోయింది.
చూసినంతనే.. నిజమేనేమో అన్నట్లుగా ఉండే ఈ పోస్టు పెను సంచలనాన్ని సృష్టించింది. రాజకీయ అనుభవం ఉన్న వారు ఎంత చెప్పినా వినని చాలామంది నిజమే అయి ఉండొచ్చు అంటూ వాదించటం మొదలెట్టారు. అంతేనా.. ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన ముఖ్యమైన వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే.. ఈ వైరల్ పోస్ట్ నిజం కాదని.. తప్పని తేలిపోయింది. మరో ప్రముఖ మీడియా ఛానల్ ఈ వైరల్ పోస్ట్ పై కథనం అందించి.. అసలు నిజంపై క్లారిటీ ఇచ్చింది.
ఇంతకీ.. ఆ వైరల్ పోస్ట్ ఏమిటంటే. వంగవీటి రంగా వెనుక ఒక బక్కపల్చటి వ్యక్తిని రౌండ్ చేసి.. అతను ఎవరో కాదు.. ప్రముఖ మీడియా సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. రంగా వెనుక వినయంగా చేతులు కట్టుకొని నిలబడిన బక్కపల్చటి వ్యక్తి రంగా కారు డ్రైవర్ కూడా అంటూతేల్చేసి పోస్ట్ చేసేశారు. తాము చెప్పే మాటలకు సాక్ష్యంగా ఫోటోను జత చేయటంతో ఎవరికి వారు ఉత్సాహంగా అందులోని నిజానిజాలేమిటన్నది క్రాస్ చెక్ చేసుకోకుండా తమకు తెలిసిన గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ రీ పోస్ట్ చేసేసరికి ఇదో భారీ వైరల్ గా మారింది.
తాము పోస్ట్ చేసిన ఫోటోకు.. ఇప్పటి రాధాకృష్ణ ఫోటోను ఫోటో షాప్ లో కలిపేసి ఒక పోస్ట్ గా మార్చేశారు. పోలికలు కాస్త దగ్గరగా ఉండటంతో.. ఎవరికి వారు ఈ హాట్ పోస్ట్ ను వైరల్ చేసేస్తున్న పరిస్థితి. ఇలా వైరల్ చేసే వారు ఎవరూ కూడా ఈ పోస్ట్ నిజమా? కాదా? అన్నది క్రాస్ చెక్ చేసుకోవటం.. లాజిక్ గా చూసినా.. రంగా లాంటి ఒక కాపు నేతకు డ్రైవర్ గా ఒక కమ్మ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించుకుంటాడా? అన్న కనీస విషయాన్ని మరిచారు. మరీ.. ముఖ్యంగా విజయవాడలో రంగా వర్సెస్ గొడవలు.. కాపు వర్సెస్ కమ్మ అన్నది లోకం మొత్తానికి తెలిసిన ముచ్చట. అందులోకి జ్యోతి ఆర్కేను చేర్చేసి తెగ వైరల్ చేశారు.
అయితే.. ఈ పోస్ట్ లో ఉన్న వ్యక్తి జ్యోతి రాధాకృష్ణ కాదని.. ఆ ఫోటోలో ఉన్నది పరమహంసని తేల్చారు. జ్యోతి ఆర్కేగా చెప్పిన వ్యక్తి అయితే తెగ సంబరపడిపోతున్నాడు. తనను లెజండరీ వ్యక్తితో పోల్చటంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో వెనుక ఉన్న ముచ్చట గురించి చెబుతూ.. తెనాలి దగ్గర పెరవారి పాలెం దగ్గర రంగా ఓ ప్రైవేటు స్కూల్ ప్రారంభానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రంగా మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోగా పరమహంస గతాన్ని గుర్తుకు తెచ్చుకొని చెప్పుకొచ్చారు. మొన్నటి దాకా రంగా కారు డ్రైవర్ రాధాకృష్ణ అంటూ ఫోటోను జత చేసి పోస్ట్ చేస్తున్న దానికి కౌంటర్ గా.. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన విషయాన్ని పోస్టు గా మార్చి పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కళ్ల ముందు కనిపించేవన్నీ నిజాలు కావన్న విషయాల్ని గుర్తిస్తే మంచిది.