బర్త్ డే బాయ్ కోహ్లీ ‘జెర్సీ నం. 18’ కథ ఇదీ

Update: 2020-11-05 15:30 GMT
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. వన్డేలు, టీ20లు, టెస్టులు అన్ని ఫార్మాట్లలోనూ విరాట్ పేరిట రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తర్వాత స్థానం విరాట్ దే.

దేశ క్రికెట్ లో ఎన్నో ఘనతలు, రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ బర్త్ డే నాడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోహ్లీ నేటితో 32వ ఏటకు అడుగుపెడుతున్నాడు.

ఐపిఎల్ ఆర్సీబీ టీమ్ విరాట్ కోహ్లీకి ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. రెడ్ అండ్ గోల్డ్ కు రక్తాన్ని, స్వేచ్ఛను, కన్నీల్లను ఇచ్చిన వ్యక్తికి ఆర్సీబీ జట్టు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. లీడర్ అండ్ లెజెండ్ అంటూ ప్రశంసలు తెలిపింది.

ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అతడు 18వ నంబర్ జెర్సీనే వేసుకుంటున్నాడు. దాని వెనుక ఓ బలమైన కారణం ఉంది.

కోహ్లీ తండ్రి డిసెంబర్ 18న మరణించారు. అప్పటికీ విరాట్ వయసు కూడా 18 కావడం గమనార్హం. తన తండ్రి జ్ఞాపకార్థం అప్పటి నుంచి 18వ నంబర్ జెర్సీని విరాట్ కోహ్లీ ధరిస్తున్నాడు.

విరాట్ తండ్రి 2016 డిసెంబర్ 18న చనిపోగా.. ఆ రోజు కూడా కోహ్లీ ఢిల్లీ తరుఫున రంజీమ్యాచ్ ఆడి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
Tags:    

Similar News