తాలిబన్లు ఆఫ్ఘనిస్తాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ సమయంలోనే పలువురు భయానక దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో వెలుగు చూశాయి. ప్రత్యేకించి కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర చోటు చేసుకున్నా ఘటనలు అంతర్జాతీయ సమాజాన్ని కంటతడి పెట్టించాయి. ప్రాణాలను కాపాడుకోవడం కోసం చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లాలని ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకున్నారు. ఈ సమయంలోనే విమానాశ్రయ పరిసర ప్రాంతాలన్నీ ఆఫ్ఘన్ దేశస్థుల తో కిటకిటలాడాయి. ఎంతో మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి దానికి ప్రయత్నించారు. కనీసం తమ పిల్లల బతుకులు అయిన బాగుండాలని దేశం దాటించేందుకు ఎంతో కృషి చేశారు. కొంత మంది ఇతర దేశాల్లో శరణార్ధులుగా వెళ్ళిపోతే... మరికొంతమంది ఆఫ్ఘనిస్తాన్ లోనే చిక్కుకుపోయారు. ఇలా బిడ్డ భవిష్యత్తు కోసం కాబూల్ విమానాశ్రయం వద్ద తల్లిదండ్రులు చంటి పిల్లాడిని అమెరికన్ సైన్యం చేతికి అప్పగించారు. అయితే ఆ బాలుడు సుమారు ఆరు నెలల తర్వాత సొంత తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. ఆ బాలుడే సాహెల్ అహ్మద్.
బిడ్డ ప్రాణాలతో బయటపడలని సాహెల్ కు రెండు నెలలు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు విమానాశ్రయానికి ఉన్న ఫెన్సింగ్ ను దాటించారు. ఇందుకుగాను అమెరికన్ సైన్యం చేతిలో ఆ చంటి పిల్లాడిని పెట్టారు. అప్పుడు వారి ఆలోచన ఏమిటంటే కనీసం ఆ పిల్లాడు అయినా బతికితే చాలు. కానీ అనుకోని పరిస్థితుల్లో సోహెల్ తల్లిదండ్రులు కూడా కాబూల్ ఎయిర్ పోర్ట్ లోకి ప్రవేశించారు. అప్పుడు ఆ బుడతడు జాడ కోసం ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఉన్నాడో అనేది తెలియలేదు. ఈ కారణంగా వారు అంత అప్గాన్ నుంచి అమెరికాకు శరణార్ధులుగా వలస వెళ్లారు. అప్పటికీ వారు ఆ బాలుడి గురించి వెతకడం మానలేదు. సుమారు ఆరు నెలలు గడిచిన తరువాత ఆ పిల్లాడి జాడ తెలిసింది. ఇందుకు ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఆ చిన్నారి అసలు తండ్రి పేరు మీర్జా అలీ. అతను ఆ దేశ రాజధాని అయిన కాబూల్ లో ఉండే అమెరికా రాయబార కార్యాలయంలో పనిచేసే వారు. ఇలా అన్ని వివరాలతో పాటు తప్పి పోయిన చిన్నారి కోసం నవంబర్ నెలలో ఓ ప్రత్యేక కథనాన్ని రాసుకొచ్చింది రాయిటర్స్. ఈ వివరాలను బట్టి ఆ పిల్లాడి ఆచూకి తెలిసింది. పిల్లవాడు ఇతర దేశాలకు ఎక్కడకూ పోలేదని కాబూల్ లోని ఓ టాక్సీ డ్రైవర్ దగ్గర భద్రంగా ఉన్నాడు అని తేలింది. అతని పేరు షఫీ మహమ్మద్ అని తెలుసుకున్నారు. దీంతో ఆ పిల్లాడిని తన తాత కు అప్పగించాలని బాలుడు తల్లిదండ్రులు కోరారు.
బాలుడుని తనకు ఇవ్వాలని తాత మొహమ్మద్ ఖాసిం రజావీ కాబూల్ కు పోయి షఫీ ని వేడుకున్నారు. దీనికి షఫీ ససేమిరా అన్నారు. అంతే కాకుండా కొన్ని షరతులు కూడా విధించారు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా అమెరికాకు చేరవేయాలని కోరారు. ఇలా చేస్తేనే బాలుని అప్పగిస్తానని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇరు వర్గాలకు మధ్య ఒప్పందాన్ని కుదిర్చారు అప్గాన్ పోలీసులు. ఎట్టకేలకు చిన్నారిని ఇచ్చేందుకు షఫీ ఒప్పుకున్నారు. ఆరు నెలల కాలంలో పిల్లడితో ఉన్న మంచి అనుభూతుల్ని నెమరు వేసుకున్న షఫీ.. బాలుడ్ని తాతకు అప్పగించేటప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు.
తాత వద్దకు చేరిన సోహెల్.. త్వరలోనే సొంత తల్లిదండ్రుల వద్దకు చేరనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇలా సోహెల్ కథ సుఖాంతం అయ్యింది.