దేశం మొత్తం ఇప్పుడు స్వర్ణానందంలో మునిగింది. ఒకే ఒక్క ఆటగాడు నీరజ్ చోప్రా సాధించిన బంగారు పతకంతో క్రీడాలోకం సగర్వగా తలెత్తుకు తిరుగుతోంది. విభాగం ఏదైనా పతకం ఖాయమన్న రీతిలో భారతీయులు తమ సత్తా చాటారు. అందుకే ప్రతీ ఒలింపిక్స్ లో పతకాల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. అయితే ఈసారి స్వర్ణ పతకంతో రికార్డు నెలకొల్పాడు నీరజ్ చోప్రా. జావెలింగ్ త్రో విభాగంగా ఊహించని రీతిలో బంగారు పతకం కొట్టుకు రావడంతో దేశం మొత్త హర్షిస్తోంది. ఈనేపథ్యంలో నీరజ్ చోప్రా గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్టు చూపుతున్నారు.
ఒకే ఒక్క స్వర్ణం.. కానీ హరియాణ ప్రభుత్వం రూ.6 కోట్లు. బీసీసీఐ రూ.కోటి.. మహేంద్రా కంపెనీ నుంచి కారు.. ఇన్ని నజరానాలు.. ఇంతటి పేరు సంపాదించిన నీరజ్ స్వర్ణం గోల్ వెనుక ఎంతో కష్టం ఉంది. మొదటిసారి ఒలింపిక్స్లో ప్రవేశించిన నీరజ్ బంగార బాబు గా తిరిగి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. హరియాణాలోని పానిపట్ జిల్లా ఖంద్రా గ్రామం నీరజ్ చోప్రా స్వస్థం. ఆయన నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. నీరజ్ తండ్రి వ్యవసాయ కౌలు రైతు. చిన్నప్పుడు నీరజ్ చాలా సుకుమారంగా ఉండేవారు. బద్ధకస్తం ఎక్కువగా ఉండేది. దీంతో చాలా బరువు పెరిగాడు. 12 ఏళ్లకే 90 కిలోల బరువు ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.
అయితే బరువు తగ్గేందుకు ఇంట్లోవాళ్లు ఎక్సర్ సైజ్ చేయమని చెప్పేవారు. కానీ నీరజ్ వినలేదు. అయితే నీరజ్ మామయ్య బీమ్ చోప్రా జాగింగ్ కోసం స్టేడియానికి వెళ్లేవాడు. దీంతో అతడిని కూడా స్టేడియానికి తీసుకెళ్లేవాడు. అక్కడ నీరజ్ కు జావెలిన్ త్రో క్రీడాకారుడు జై చౌదరి కనిపించాడు. సరదాగా జావెలిన్ ను నీరజ్ చేతికిచ్చి విసరమని చెప్పాడు. దీంతో అంతటి బరువుతోనైనా నీరజ్ 40 మీటర్ల దూరం వరకు విసిరాడు. దీంతో ఆయన జన్మత: ప్రతిభ ఉందని జై చెప్పేవాడు. దీంతో నీరజ్ కు జావెలిన్ త్రోపై ఆసక్తి పెరిగింది. ఇందుకోసం ఆయన వ్యాయామం కూడా మొదలు పెట్టాడు.
అయితే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. ఓసారి పేపర్లో అతని ఫొటో చూసి ఆశ్చర్యపోయారు. నీరజ్ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. అయినా నీరజ్ ప్రయత్నాన్ని వారు ప్రోత్సహించారు. అవసరమైన సౌకర్యాలు సమకూర్చారు. దీంతో నీరజ్ 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్ షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక్కడ చూపిన ప్రతిభతో నేషనల్ క్యాంపులో ఉండేందుకు అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి నీరజ్ దశ తిరిగింది.
జావెలిన్ త్రో లో మెళకువలు నేర్చుకున్న నీరజ్ 2016 లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్ షిప్లో రజతం గెలిచాడు. ఆ తరువాత వరల్డ్ అండర్ 20 చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచాడు. అయితే ఇక్కడ నీరజ్ 86.48 మీటర్ల దూరం విసిర రికార్డు నెలకొల్పాడు. 2016లో గౌహతిలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలే, 2017లో భువనేశ్వర్లో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచాడు. 2018లో జకార్తాలలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్ లో స్వర్ణం సాధించాడు. ఇదిలా ఉండగా నీరజ్ ఆర్మీలో సుబేదారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని ప్రతిభ చూసి పోటీల్లో పాల్గొనేందుకు అధికారులు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇప్పుుడు వారి పేరు నిలబెట్టాడు.ఈ సందర్భంగా ఆర్మీ జవాన్లు సంబరాలు చేసుకున్నారు.