స్ట్రైట్ క్వశ్చన్ టూ బాబు : అమరావతి కావాలా.. అభివృద్ధి కావాలా....?

Update: 2022-05-06 08:07 GMT
అదేదో పాత సినిమాలో నరుడా ఏమి నీ కోరిక అని పాతాళ భైరవి అడుగుతుంది. అలా విశాఖ టూర్ లో చంద్రబాబు జనాలకు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. అది కూడా జవాబు తానే చెబుతూ ప్రశ్న సంధించారు. విశాఖకు రాజధాని కావాలా లేక అభివృద్ధి కావాలా అని అడుగుతూనే అభివృద్ధే విశాఖకు కావాలని తానే ముక్తాయించారు.

ఆ మీదట తాపీగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే అమరావతిని రాజధానిగా చేస్తూ విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, దీనికి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది వేరే విషయం కానీ వైసీపీ అయితే ఇంతకు ఇంతగానే రియాక్ట్ అయింది. యువ మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే అదే ప్రశ్నను రివర్స్ లో చంద్రబాబుకే వినిపించారు.

బాబుగారూ మీకు అమరావతి అభివృద్ధి  కావాలా, లేక రాజధాని కావాలా అంటూ స్ట్రైట్ క్వశ్చన్ సంధించారు.  నిజంగా మీకు అమరావతి అభివృద్ధి మీదే మక్కువ ఉంటే ఎందుకు అక్కడ రాజధాని కోరుకుంటున్నారు బాబూ అని అడిగి కడిగేసారు కూడా. మీ బినామీల కోసం, మీ అమరావతి కోసం విశాఖ సహా  ఉత్తరాంధ్రా బడుగు  జనాలు త్యాగాలు చేయాలా బాబు గారూ అంటూ గట్టిగానే నిలదీశారు.

విశాఖ రాజధాని అవడం ఖాయం, అది ఏరో రోజు జరిగి తీరుతుంది అని కూడా గుడివాడ ఘంటాపధంగా చెప్పుకొచ్చారు.  ఇక చంద్రబాబు అధికారం మరిగిన  పులిగా అభివర్ణించారు. ఆయనకు అధికారం పోతే దిక్కుతోచక ఏమీ చేయలేకపోతున్నారు అని కూడా గుడివాడ మండిపడ్డారు.

జగన్ మూడేళ్ల పాలనలో  లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయల నగదు మొత్తాలు పేదల ఖాతాల్లోకి చేర్చారని, అమ్మఒడితో పాటు, అనేక రకాలైన పధకాలను అమలు చేశారని గుడివాడ చిట్టా విప్పారు. మరి ఇందులో ఏ ఒక్క స్కీమ్ ని అయినా బాబు తన ఏలుబడిలో అమలు చేశారా అని ప్రశ్నించారు.

నాడు కూడా ఏపీకి ఇంతే ఆదాయం వచ్చింది కదా, మరి ఏ స్కీములూ అమలు చేయకపోతే ఆ డబ్బు ఏమైంది చంద్రబాబు గారు, అంతా కలసి తినేశారా అని గుడివాడ డైరెక్ట్ గానే అడిగేశారు. ఏపీలో అధికారంలోకి రాలేమనే చంద్రబాబు ఇపుడు అసత్యాలను ప్రచారాన్ని చేస్తూ  టూర్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఏపీకి పట్టిన ఐరన్ లెగ్ అంటే ఎవరో కాదు అది చంద్రబాబే అని కూడా గుడివాడ సెటైర్లు వేశారు. రెండవ ఐరన్ లెగ్ ఆయన సుపుత్రుడు లోకేష్ బాబు అని అన్నారు. తన కొడుకు ఐరన్ లెగ్ కాబట్టే పవన్ కళ్యాణ్ కి కన్నుగీటుతున్నారని కూడా గుడివాడ  బాబు మీద పంచులే వేశారు. మొత్తానికి విశాఖ రాజధానిని ప్రజలు త్యాగాలు చేయరు అంటూ కొత్త సెంటిమెంట్ నే గుడివాడ రేపారు అని అంటున్నారు.
Tags:    

Similar News