సినిమాల్లో కనిపించే సాగర కన్య రూపంలో ఓ వింత శిశువు జన్మించింది. ఈ అరుదైన సంఘటనకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రి వేదికైంది. సంగ్గారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణికి నొప్పులు రావడంతో.. బుధవారం నగరంలోని పేట్ల బురుజు ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళకు ఆపరేషన్ చేసి పురుడు పోశారు వైద్యులు. కానీ.. శిశువు వింత ఆకారంలో జన్మించింది.
కాళ్లు రెండు పూర్తిగా కలిసిపోయి జల కన్య ఆకారంలో ఉంది ఆ శిశువు. అయితే.. జన్మించిన రెండు గంటల తర్వాత ఆ శివువు మృతిచెందింది. జననేంద్రియాలు సరిగా వృద్ధి చెందలేదని వైద్యులు తెలిపారు. మెర్మైడ్ సిండ్రోమ్ వల్ల ఇలాంటి జననాలు సంభవిస్తుంటాయని చెప్పారు.
దాదాపు పది లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని తెలిపారు. అయితే.. ఈ సిండ్రోమ్ వల్ల తల్లి గర్భంలోనే కాళ్లు అతుక్కుపోతుంటాయట. కానీ.. చాలా మందిలో అవి కొంతమేర మాత్రమే అతుక్కుపోతాయట. ఈ శిశువుకు పూర్తిగా అతుక్కుపోయాయి. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.