హిందుపురంలో విచిత్రమైన లాక్‌ డౌన్ ..ఎలా అమలు చేస్తున్నారంటే?

Update: 2020-04-04 10:30 GMT
దేశంలో క‌రోనా వైరస్ విజృంభిస్తుంది. వేగంగా విస్తరిస్తున్న ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం లాక్‌ డౌన్ ప్ర‌క‌టించింది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు - పోలీసులు ప‌దేప‌దే విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. నిత్యావ‌స‌రాలు - కూర‌గాయ‌లు వంటివి కొనుగోలు చేసేందుకు కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల వ‌ద్ద‌కే స‌రుకులు స‌ప్లై చేస్తున్నారు. అయినా కూడా ఇంకా రోజురోజుకి ఈ వ్యాధి పెరిగిపోతుంది.

ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ లేని వైర‌స్‌ ను అరిక‌ట్టాలంటే సామాజిక దూరం ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల‌కు అనేక విధాలుగా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆక‌తాయిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ - య‌ద్దేచ్చ‌గా బ‌య‌ట‌ తిరిగేస్తున్నారు. అలాంటి వారికి త‌గిన బుద్ది చెప్పేందుకు పోలీసులు రూట్ మార్చారు. లాక్‌ డౌన్‌ ను ప‌క్క‌గా అమ‌లు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇక విషయానికొస్తే ... అనంతపురం జిల్లాలో క‌రోనా వైర‌స్ కోరలు చాచుతుంది. లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ గా తేలింది. దీంతో స్థానికంగా ప్రజలని అధికారులు హెచ్చరించారు. అలాగే కరోనా మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో - మ‌రింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో అయిన‌ప్ప‌టికీ ప్రజలు పట్టించుకోకపోవటం తో అధికారులు కొంచెం రూటు మార్చారు. దీనితో ఇళ్లకు తాళాలు వేసి జనాలు బయటకు రాకుండా చేస్తున్నారు. కేవలం ఉదయం - సాయంత్రం తాగునీరు - పాలు - ఇతర నిత్యావసరాలు అవసరమైనవారికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. లేపాక్షిలో ఎవరైన నిబంధనలను అతిక్రమించి వీధుల్లోకి వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే చిలమత్తూరులోనూ ఇదే విదంగా ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. జనాలు నిబంధనల్ని పట్టించుకోవడం లేదని, వైరస్ వ్యాప్తి ఉందని చెప్పినా వినడం లేదని - అందుకే ఇలా తాళాలు వేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News