కరోనాకు సంబంధించిన ఏదైనా వ్యాక్సిన్ ను తీసుకుంటే సుమారు 24 గంటల్లోపు కొంతమంది కి చలి,జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటివి రావడం సహజం. ఇలాంటి ఘటనలు చాలా విన్నాం. చూశాం కూడా. ఇలా జరగడం కూడా చాలా సహజం. ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెప్పారు. అయితే ఇటువంటి సమయంలోనే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఉపయోగించవద్దని సూచిస్తారు. ఇవి అన్నీ సాధారణంగా జరుగుతాయని అందరికీ తెలుసు. కానీ కొత్తగా మరో రకమైన దుష్ప్రభావం కూడా కనిపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఇది ఎవరైతే బూస్టర్ డోస్ తీసుకుంటారో వారిలో కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి ఇది ఓ వింతైన సైడ్ ఎఫెక్ట్ అని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాన్ని అనుభవించలేదని టీకా తీసుకున్న వారు చెబుతున్నారు. అది ఏమిటంటే.. బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో ఒక విధమైన లోహపు రుచి కనిపిస్తుందంట. ఇటీవల కాలంలో చాలా మంది ఈ రుచిని అనుభవించినట్లు పేర్కొన్నారు.
ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉన్న వారికి కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లోహపు రుచి ని అనుభవించిన వారు చాలా మంది ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమకు బూస్టర్ డోస్ తీసుకోక ముందు ఈ రుచి కనిపించలేదని కేవలం ఇప్పుడు మాత్రమే ఆ భావన కలుగుతుందని చెప్పారు. అయితే దీనిపై తాజాగా పరిశోధకులు స్పందించారు. ఇలాంటి కేసు తొలుత అమెరికాలో నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఇది వెలుగు చూసి కూడా ఏడాది కావొస్తుందని అన్నారు. దీనిని చాలా మంది నిపుణులు తీవ్రమైన ప్రభావంగా చెప్పుకొచ్చారు. ఈ రుచి చాలా మందికి నికెల్ మెటల్ కి సంబంధించిన రుచిగా అనిపించిందని చెప్పారు. ఇది వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల వరకు లోహపు రుచి భావన కలుగుతున్న విధంగానే ఉంటుందని తెలిపారు. అయితే దీనిని అమెరికాలో అంటువ్యాధుల నిర్మూలన సంస్థ మాత్రం ఈ వాదనను కొట్టి పారేసింది. ఇది చాలా తేలికైన లక్షణమని స్పష్టం చేసింది. దీని గురించి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
అంతేకాకుండా ఇటువంటి లక్షణాలు అందరిలో లేవు కాబట్టి.. భయపడాల్సినంత ఏం లేదని తేల్చి చెప్పింది అమెరికా అంటువ్యాధుల నిరోధక సంస్థ. కోవిడ్ వచ్చిన వారికి ఇలా అనిపిస్తుండొచ్చని తెలిపింది. వైరస్ సోకిన వారిలో చాలా మందికి ఇలాంటి లక్షణం ఉండే అవకాశం ఉందని.. అంతగానీ బూస్టర్ డోస్ వల్ల ఇలా జరగడం అనేది అసాధ్యం అని తెలిపింది. మనలో చాలా మందికి వైరస్ వచ్చి నయం అయినా కూడా తెలియకుండా ఉండే అవకాశం ఉంది కావున ఇలా జరగడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదని పేర్కొంది. మరి కొందరిలో వారు ఉపయోగించే టాబ్లెట్ వల్ల కూడా వస్తుందని చెప్పింది.