నవరత్నాలు.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా తీసుకున్న పథకాలు. గత 2019 ఎన్నికల సమ యంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో పొందు పరిచిన పథకాలు. ఈ పథకాలను అడ్డు పెట్టుకునే తాము అధికారంలోకి వచ్చామని.. మేనిఫెస్టోనే.. తమకు భగవద్గీత... బైబిల్.. ఖురాన్.. అని వైసీపీ నేతలు పదే పదే చెబుతుంటారు. ఈ క్రమంలో అధిఆరంలోకి వచ్చిన నాటి నుంచి కూడా నవరత్నాలను అమలు చేసేందు కు నాయకులు ప్రత్యేక శ్రద్థ తీసుకున్నారు. ఎవరైనా మీరు ఇప్పటి వరకు ఏం చేశారంటూ.. ప్రభుత్వ పెద్దలను అడిగినా.. వారు ఠక్కున చెబుతున్న సమాధానం.. నవరత్నాలు! అనే!
అయితే.. ఈ నవరత్నాలను అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా వీటిని ప్రజలకు అందిస్తోంది. అయితే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ నవరత్నాలు ఏమేరకు పనిచేస్తున్నాయనేది ప్రశ్న. క్షేత్రస్థాయిలోల చూస్తే.. వీటికి పెద్ద బూమ్ కనిపించడం లేదు. పేదలకు వేలాది రూపాయలు అందిస్తున్నా.. దీని తాలూకు చర్చ ఎక్కడా లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు రూ.2000 చొప్పున కిసాన్ సమ్మాన్ నిధిని అందిస్తోంది.
అయితే.. ఇచ్చేది రెండువేలే అయినా.. ప్రచారం మాత్రం రెండు లక్షలు ఇచ్చినట్టుగా క్షేత్రస్థాయిలో రైతులు చెప్పుకొంటున్నారు. కానీ, ఏపీకి వచ్చే సరికి ఈ తరహాలో ప్రజల మధ్య చర్చలేకుండా పోయింది. దీనికి కారణం.. నవరత్నాలు పనిచేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. అయితే.. ఈ కేడర్‌కు.. తెలియకుండానే.. పథకాలు చేపడుతున్నారు. దీంతో కేడర్ ఆయా పథకాలపై ఎలాంటి అవగాహన పెంచుకోలేక పోయింది. పోనీ.. నేతలైనా పట్టించుకుంటున్నారా? అదీ లేదు. దీంతో నవరత్నాలపై ప్రచారం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక, లక్షల సంఖ్యలో కేడర్ ఉన్నా.. వారిని కాదని.. వలంటీర్లకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ప్రచారం కనిపించడం లేదు. కేడర్ కూడా నిస్సత్తువగా మారిపోయింది. మా ప్రభుత్వం వచ్చినా.. మాకు పనిలేకుండా పోయిందనే వాదన వారిలో వినిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికల సమయంలో ప్రజలను కలిసి కేడర్ .. తర్వాత దూరమయ్యారు. అందుకే జగన్ అప్పులు చేసి మరీ నవరత్నాలు అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవి పెద్దగా పనిచేయడం లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని.. కేడర్ పెద్దగా వీటిని పట్టించుకుని.. ప్రచారం చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. మరి వైసీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.