ఒకటి తర్వాత ఒకటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ సర్కారు తాజాగా ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. చెక్కులిచ్చి.. అవి చెల్లకుంటే తీవ్ర నేరంగా పరిగణించటమే కాదు.. తొలుత జైలుకు వెళ్లేలా చట్టంలో మార్పులు చేయటమే కాదు.. బెయిల్ ఇవ్వటానికి వీల్లేని నేరంగా దీన్ని పరిగణించాలన్న మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు.
నగదు లావాదేవీలు తగ్గించి.. క్యాష్ లెస్ లావాదేవీల్ని పెంచాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం.. ఆ దిశగా అవసరమైన విధానాల్ని చట్టబద్ధం చేయాలని భావిస్తోంది. అదే సమయంలో చెల్లని చెక్కుల్ని ఇచ్చేసే వైనాన్ని కట్టడి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే కఠిన నిబంధనలు ఉండేలా బదిలీయోగ్య పత్రాల చట్టం 1881కి మార్పులుచేర్పులు చేయాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.
చెల్లని చెక్కులు ఇచ్చిన వారికి సంబంధించిన కేసుల్లో బెయిల్ ఇవ్వటానికి వీల్లేని నేరాలుగా పరిగణించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం లేకపోలేదు. చెల్లని చెక్కులకు సంబంధించిన కేసులు భారీగా ఉండటంతో పాటు.. ఏళ్ల తరబడి సా..గుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చెల్లని చెక్కులకు సంబంధించిన కేసులు 18లక్షల మేర ఉన్నాయని..ఇలాంటి కేసుల విషయంలో చట్టం కఠినంగా మార్చటం ద్వారా పరిస్థితుల్లో మార్పులు తేవటంతో పాటు.. చెక్కులు జారీ చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించే చేయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో నగదు లేకున్నా.. చెక్కులు ఇచ్చేయటం.. బ్యాంకులకు చెక్కులు వచ్చిన తర్వాత రిజెక్ట్ కావటం మామూలు వ్యవహారంగా మారింది. ఇలాంటి తీరుకు అడ్డుకట్ట వేసేందుకే చట్టంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
చెక్కులకు సంబంధించి నిబంధనల్లో కొన్ని మార్పుల్ని 2015లో చేశారు. దీని ప్రకారం చెల్లని చెక్కులకు సంబంధించిన కేసుల్ని వాటిని ఇచ్చిన చోట కాకుండా.. వాటిని ఎక్కడైతే వేస్తారో అక్కడి కోర్టుల్లో కేసులు వేసేలా చర్యలు తీసుకుంది. చెక్కులు తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో.. చెక్కులు బ్యాంకులు సమర్పించే వారు దూరప్రాంతాల్లో ఉన్నా.. చెక్కు చెల్లింపులు జరపని వారు.. అంతదూరానికి వెళ్లి విచారణకు.. కోర్టు వాయిదాకు హాజరు కావాల్సి ఉండేది. ఈ మార్పు తర్వాత పరిస్థితులో కాస్త మార్పు వచ్చినట్లుగా చెబుతారు.
ఇక.. తాజాగా మార్చాలని భావిస్తున్న అంశాల్ని చూస్తే.. చెక్కు బౌన్స్ అయిన తర్వాత ఈ ఇష్యూను రెండు పక్షాలు క్లోజ్ చేసుకోవటానికి 30 రోజుల సమయం ఇస్తారు. ఒకవేళ ఆ గడువులోపల చెక్కు జారీ చేసిన వారు ఇష్యూను క్లోజ్ చేసుకోకపోతే.. చెల్లని చెక్కును ఇచ్చిన వారిని జైలుకు పంపించొచ్చు. అంతేకాదు.. ఈ తరహా కేసుల్లో విచారణ పూర్తి అయి.. కోర్టు తీర్పు కంటే ముందే చెక్ బౌన్స్ కు కారణమైన వ్యక్తిని జైలుకు పంపొచ్చు. ఒకవేళ ఈ మార్పులు కానీ చట్టబద్ధంగా మారితే.. చెక్కు ఇవ్వాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/