విశాఖ స్టీల్ ప్లాంట్ లో మోగిన సమ్మె సైరన్

Update: 2021-03-11 12:30 GMT
విశాఖ ఉక్కు ఉద్యమం మరో అంకానికి చేరింది. స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ యాజమన్యానికి కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు.

ఈనెల 25వ తేదీ తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని కార్మిక నేతలు స్పష్టం చేశారు. ఈనెల 17న అఖిలపక్షం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.

ఈనెల 20వ తేదీన కార్మికుల కుటుంబాలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలను కార్మిక సంఘాలను ఆహ్వానించాలని నిర్ణయించారు.

ఈనెల 15న ఉక్కు పరిపాలన భవనం వద్ద భారీ ఎత్తున నిరసన, 20న జాతీయ, రాష్ట్ర స్థాయి కార్మిక నాయకులతో ఉక్కు తృష్ణా మైదానంలో కార్మిక గర్జన నిర్వహించనున్నారు. 15,16,17 తేదీల్లో అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ నాయకులను కలిసి మద్దతు తెలుపాలని కోరనున్నారు.

ఇక విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఏపీ ప్రజల పోరాటానికి టీఆర్ఎస్ తరుఫున మద్దతు ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు.
Tags:    

Similar News