పిచ్చాయ్ ను ఓ చూపు చూసిన సీనియ‌ర్లు..?

Update: 2015-08-16 10:24 GMT
ఇప్పుడు చెప్ప‌బోయేదంతా గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచ్ఛాయ్ కాలేజీ రోజుల గురించి. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ లో చ‌దువుకునే రోజుల్లో సుంద‌ర్ పిచ్ఛాయ్ ను సీనియ‌ర్లు ఏ విధంగా ఆడుకున్నార‌న్న అంశంపై ఒక సీనియ‌ర్..ప్ర‌స్తుతం బోస్ట‌న్ లో ఎల‌క్ట్రానిక్ ఇంజ‌నీర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సావిక్ గంగోపాధ్యాయ అనే వ్య‌క్తి మీడియాకు వెల్ల‌డించాడు.

ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ లో 1985 నుంచి 1993 మ‌ధ్య కాలంలో చ‌దివిన విద్యార్థుల్లో చాలామంది అత్యుత్త‌మ స్థానాల‌కు చేరుకున్నార‌ని.. సుంద‌ర్ పిచ్ఛాయ్‌.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ లాంటి వారు ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చారు. సుంద‌ర్ పిచ్ఛాయ్ ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ కు వ‌చ్చిన స‌మ‌యంలో క్యాంప‌స్ లో ర్యాగింగ్ ఎక్కువ‌గా ఉండేద‌ని.. పొడుగ్గా.. బ‌క్క‌ప‌ల్చ‌గా ఉండే సుంద‌ర్ సీనియ‌ర్ల అంద‌రి దృష్టిని ఇట్టే ఆక‌ర్షించే వాడ‌ని చెప్పుకొచ్చాడు.

క్యాంప‌స్ లోసీనియ‌ర్లు ఎవ‌రైనా స్వాగ‌తం ప‌లికితే అత‌నికి ర్యాగింగ్ త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌ని.. సుంద‌ర్ ను చాలామంది స్వాగ‌తం ప‌లికేవార‌న్నారు. కాలేజీలో చ‌దివే నాటికి.. ఇప్ప‌టికి ఎలాంటి మార్పు లేద‌ని.. అత‌ని పాత ఫోటోలు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పుకొచ్చాడు. క్యాంప‌స్ లో ర్యాగింగ్‌కార‌ణంగా సీనియ‌ర్ల‌తో బంధం బ‌ల‌ప‌డేద‌ని.. త‌న కోర్సు చివ‌ర్లో.. సుంద‌ర్ ని చివ‌రిసారి క‌లిశాన‌ని.. త‌న జూనియ‌ర్ అత్యున్న‌త స్థాయికి చేరుకోవ‌టంపై ఈ సీనియ‌ర్ విప‌రీత‌మైన ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News