‘‘ఓపెన్ గా మాట్లాడుకుందాం’’ అంటూ ఎవరికైనా అవకాశం ఇస్తే గతంలో ఎలా ఉండేదన్నది పక్కన పెడితే.. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో మార్పులు వచ్చిన విషయాన్ని రాజకీయనాయకులు గుర్తించాల్సిన అవసరం వచ్చేసింది. మీడియాతో పాటు సోషల్ మీడియా పుణ్యమా అని అందరికి అన్నీ విషయాలు తెలియటమే కాదు.. తెలియాల్సిన దాని కంటే ఎక్కువగా తెలీటం.. ప్రతి విషయానికి సంబంధించిన నిజం.. అబద్ధం అన్నతేడా లేకుండా సమాచారం ప్రవాహంగా వచ్చి పడుతోంది. ఎవరు దేన్ని నమ్ముతారో? దానికి తగ్గ పదునైన వాదనను ఇప్పుడు వినిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అడగండి.. నేను సమాధానం ఇస్తాను అన్న ఆఫర్ తో పరిణామాలు ఎలా ఉంటాయి? జనాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయన్నది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తున్న విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం తేల్చేస్తోంది.
టీడీపీ యువ చైతన్య సదస్సుల్ని వరుసగా నిర్వహిస్తున్న లోకేశ్ కు ఇటీవల కాలంలో ఎదురవుతున్న ప్రశ్నల పరంపరను చూస్తే.. ఆయన్ను విద్యార్థులు అడిగేస్తున్నారనే కన్నా.. కడిగేస్తున్నారన్న భావన కలగటం ఖాయం. కొన్ని ప్రశ్నలు ఎంత సూటిగా.. షార్పుగా ఉంటున్నాయంటే.. చినబాబును నోటి వెంట మాట రాకుండా చూస్తున్నాయని అంటున్నారు. ఇక.. ప్రశ్నలు అడిగే క్రమాన్ని చూస్తే.. నేతలతో మాట్లాడేటప్పుడు సగటు జీవికి మొహమాటపు పరదాల వెనుక నుంచి మాట్లాడేవారు. మారిన కాలంలో భాగంగా.. ఇప్పుడా మర్యాద పరదాల్ని దాటేసి వచ్చేసి.. మనసుకి ఏం అనిపిస్తే దాన్నే ప్రస్తావిస్తున్నారు. దీంతో.. ఊహించని రీతిలో ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.
తాజాగా చినబాబుకు విద్యార్థులు సంధిస్తున్న ప్రశ్నలకు సంబంధించి శాంపిల్ గా కొన్ని ప్రశ్నల్ని ఇక్కడ ప్రస్తావిస్తే.. ఆయనకు ఎంతటి ఇబ్బందికర పరిస్థితిని ఎదురయ్యేలా చేస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న లోకేశ్.. టీడీపీ యువ చైతన్య సదస్సుల్లో భాగంగా పలు కాలేజీలకు చెందిన విద్యార్థులతో జరిపిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయనకు ఎదురైన వాడివేడి ప్రశ్నల్ని చూస్తే..
= ‘‘అవినీతి పరులంటూ నీతులు చెబుతున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే మీరేం చర్యలు తీసుకున్నారు? ఆయన అవినీతి చేయలేదు?
= ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకే ప్రధాని పెద్దనోట్ల రద్దు చేశారని మీరు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల తిమింగళాలు తప్పించుకున్నాయి. చిన్న చేపలు చనిపోతున్నాయి కదా?’’
= ‘‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి. మరి.. హోదా కోసం మీరెందుకు పోరాడటం లేదు?’’
= ‘‘ప్రత్యేక హోదా బదులు రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి?’’
= ‘‘మీరు ఎన్టీఆర్ మనమడిగా చెప్పుకోవటానికి ఇష్టపడతారా? చంద్రబాబుకు కొడుకుగా చెప్పుకోవటానికి ఇష్టపడతారా?’’
= ‘‘మీ కాలేజీ డేస్ లో మీ లవ్ గురించి చెప్పండి?’’
= ‘‘కృష్ణ పట్నం పోర్టు నిర్మాణానికి మా భూములు ఇచ్చేటప్పుడు మాకు పోర్టులో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కానీ.. మాకు ఉద్యోగాలు ఇవ్వలేదేం?’’
= ‘‘రిలయన్స్ సంస్థకు 2700 ఎకరాల భూములు ఇక్కడి ప్రజలు ఇచ్చారు. ఇప్పటివరకూ రిలయన్స్ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టలేదు. రైతులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. మీరేమో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు వచ్చినట్లుగా చెబుతున్నారే?’’
= ‘‘అమరావతి ధనికుల కోసమే కడుతున్నారు కదా? మాలాంటి వారికి అక్కడ ఉపాధి ఎలా దొరుకుతుంది?’’
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/