దేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త ఆంక్షలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. దీనికి సంబంధించి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే ఇవ్వాలంటున్నారు. ఆయన పాల్గొనే సభల విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ అనుసరించని కొత్త తరహా విధానాల్ని అనుసరించటమే దీనికి కారణం. ఒక బిజినెస్ స్కూల్లో జరిగే వేడుకలకు హాజరవుతున్న ప్రధాని మోడీ.. ఆ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు సోషల్ మీడియా బ్యాక్ గ్రౌండ్ ను క్షుణ్ణంగా చెక్ చేసే కొత్త విధానం గురించి బయటకు వచ్చిన వివరాలు ఆసక్తికరంగానే కాదు.. ఇదెక్కడి పద్దతన్న రీతిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (సింఫుల్ గా చెప్పాలంటే ఐఎస్ బీ) ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తోన్న కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న జరిగే ఈ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రక్షణ చర్యలతో పాటు.. భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొంటున్న వేళ.. ఇలాంటి భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవటాన్ని తప్పు పట్టలేం. కానీ.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి విద్యార్థి ప్రొఫైల్ ను చెక్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఎవరైనా విద్యార్థి సోషల్ మీడియా అకౌంట్ లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టి ఉంటే.. అలాంటి వారిని సభకు హాజరు కాకుండా నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మోడీ ప్రోగ్రాంలో పాల్గొనాలంటే ఇప్పటివరకు సదరు విద్యార్థులు ఎవరూ మోడీకి.. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టి ఉండకూడదు.
ఇందులో భాగంగా విద్యార్థులు సోషల్ బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఐఎస్ బీ క్యాంపస్ లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా.. మొహాలీ క్యాంపస్ లో మరో 300 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 930మంది పీజీ విద్యను పూర్తి చేస్తుండగా.. వీరందరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు చేపట్టిన వారిలో పంజాబ్ రైతులు ఎక్కువగా ఉండటం తెలిసిందే. ఐఎస్ బీ మొహాలీ క్యాంపస్ లో పంజాబీ విద్యార్థులు అధికంగా ఉండటంతో.. ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. రోటీన్ గా ప్రధానమంత్రి హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించిన టూర్ ఖరారు అయితే షెడ్యూల్ విడుదల చేస్తారు. కానీ.. తాజా పీఎం ప్రోగ్రాంకు సంబంధించి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు ఎప్పుడు వస్తారు? ఐఎస్ బీకి ఎప్పుడు హాజరవుతారు? ఎంతసేపు ఉంటారు? ఎప్పుడు తిరిగి వెళతారన్న వివరాల్ని అస్సలు వెల్లడించకపోవటం ఆసక్తికరంగా మారింది. నిరసన స్వరం ప్రజాస్వామ్య సహజ లక్షణం కదా? దాన్ని ఆంక్షలతో బయటకు రాకుండా ఉండేలా చేయాలనుకోవటం ఏమిటి?