చిన్నారి అతిధుల్ని అంతగా అవమానించారా?

Update: 2015-11-15 05:07 GMT
వారంతా చిన్నారులు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని అతిధులుగా హైదరాబాద్ ఆహ్వానించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా అతిధులుగా హైదరాబాద్ కు పలువురు చిన్నారు వచ్చారు. వీరికి ప్రభుత్వం తరఫున హోటల్ పార్క్ లో బస కల్పించారు. వారంతా హోటల్ రూమ్ లో చెకిన్ అయి.. కార్యక్రమాల్లో పాల్గొనటానికి బయటకు వెళ్లారు. పిల్లల బస కోసం హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్ ద పార్క్ లో బస కల్పించారు.

అయితే.. పొద్దున వెళ్లిన పిల్లలు రాత్రి తిరిగి హోటల్ వద్దకు వచ్చేసరికి వారికి షాక్ తగిలిన పరిస్థితి. ఎందుకంటే.. వారి రూమ్ ల్లో ఉండాల్సిన లగేజ్ బయట ఉండటం వారిని కంగుతినేలా చేసింది. ఎందుకిలా అంటే.. నిర్వాహకుల అభ్యర్థన మేరకు వేరే రూములు ఇచ్చామని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.

మరోవైపు.. రూమ్ లు లేక చిన్నారులు చలిలో రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకూ చలిలోనే బయట ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. చలిలో ఉన్న వారిని.. కనీసం హోటల్ లాబీల్లోకి కూడా అనుమతించలేదని సమాచారం. అనంతరం వారిని నగరంలోని మరో హోటల్ కు షిఫ్ట్ చేశారు. పిల్లలు లేని సమయంలో వారి లగేజ్ ను ఒక చోటకు చేర్చిన క్రమంలో.. తమ విలువైన వస్తువులు మిస్ అయినట్లుగా పిల్లలు చెబుతున్నారు. స్టార్ హోటల్ అయి ఉండి.. పిల్లల పట్ల ఇంత కర్కసంగా వ్యవహరించిన హోటల్ పై పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సదరు హోటల్ ఎందుకిలా ప్రవర్తించిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News