తెలంగాణలో ఉద్యమాల పురిటిగ్డడ పేరు సంపాదించిన ఉస్మానియా యూనివర్సిటీలో పరిణామాలు మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా టీఆర్ ఎస్ తో కలిసి ఉద్యమించిన ఓయూ విద్యార్థులు ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నారు. తాజాగా పార్లమెంటరీ పార్టీ నేతలు గెటవుట్ అనే స్థాయికి ఓయూలో టీఆర్ ఎస్ వ్యతిరేకత చేరింది. ఇలా పరాభవం పాలైంది సీనియర్ పార్లమెంటేరియన్ కే కేశవరావు.
ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ కేకే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఓయూ ఉత్సవాల కమిటీతో సమావేశమయ్యారు. మాట్లాడి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న వివిధ విద్యార్థి సంఘాల నేతలు కేకేను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఉద్యోగాలను సైతం వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు కేకే గెటవుట్ అంటూ విమర్శలు గుప్పించారు. కేకే సర్దిచెప్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి కేకేను యూనివర్సిటీ నుంచి బయటకు పంపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/