ఇక ఆడ మగా క్రికెట్.. కనులారా విందే విందు

Update: 2019-04-26 13:42 GMT
రోజు రోజుకి క్రికెట్ లో కొత్త పోకడలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకొస్తున్నాయి... ఒకప్పుడు క్రికెట్ అంటే 60 ఓవర్లు ఆటగా ఉండేది.. ఆ తర్వాత పరిణామ క్రమంలో అది 50 ఓవర్ల వన్డే మ్యాచ్ గా మారింది.. టెస్ట్ క్రికెట్ ఉండనే ఉంది.. కొద్ది సంవత్సరాల క్రితం 20-20 పేరుతో పరిమిత 20 ఓవర్ల క్రికెట్ వచ్చింది.. దీనిలో భాగంగా అంతర్జాతీయ టీ20 వరల్డ్ కప్ తో పాటు మ్యాచ్ లు - ఐపీఎల్ లాంటి దేశవాళీ టోర్నీలు క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి.... ఇప్పుడు తాజాగా క్రికెట్ మరో సంచలనం చోటు చేసుకోబోతోంది.. అదే ఆడామగా క్రికెట్... త్వరలో క్రాస్ జెండర్ టోర్నమెంట్ కు రంగం సిద్దమవుతోంది..

ఈ దిశగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌ సీబీ) ఓఅడుగు ముందుకేసింది. టీ–20 మ్యాచ్‌లను మిక్స్‌ డ్‌ జెండర్‌ గా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. టీ20 క్రికెట్‌లో మన ఇండియన్‌ టీంలో పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు కూడా ఇప్పుడు ఆడనున్నారు. ఆరుగురు మేల్‌ క్రికెటర్స్ - ఐదుగురు ఫీమేల్‌ క్రికెటర్స్‌ తో ఉన్న టీంని ・మిక్స్‌డ్‌ జెండర్‌ క్రికెట్‌ టీంగా పిలుస్తారు. ఇప్పటి వరకు మహిళలకు - పురుషులకు వేరు వేరుగా వరల్డ్ కప్ నుంచి టోర్నీ మ్యాచ్ లు జరుగుతున్నాయి.. పురుషుల క్రికెట్ తో పోల్చితే మహిళల క్రికెట్ కు ఆదరణ తక్కువే.. అందుకే కొత్తగా ఈ మిక్స్ డ్ జెండర్ క్రికెట్ ను తెరపైకి తెచ్చినట్లున్నారు నిర్వహాకులు

దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్ సీ బీ ఇండియన్‌ టీం నుంచి ఐదుగురు మహిళాక్రికెటర్లు - ఆరుగురు పురుష క్రికెటర్లతో జట్టు రూపొందించారు. కోహ్లీ - మిథాలీరాజ్ - హర్మన్‌ ప్రీత్‌ కౌర్ - వేదకృష్ణమూర్తి తదితర క్రికెటర్లతో ఇటీవల ఆర్‌ సీబీ ఓ ప్రోమోను రూపొందించింది. దీనిపై క్రికెట్‌ అభిమానుల్లో స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆ వీడియోను యూ ట్యూబ్‌ వేదికగా విడుదల చేసింది. ప్రోమోను మెచ్చుకుంటూ కొన్ని గంటల్లోనే లక్షల్లో హిట్స్ - వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఇందులో మన హైదరాబాద్‌ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు.సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీరాజ్ - ఇటీవల టీ20కి బౌలర్‌ గా ఎంపికైన అరుంధతీ రెడ్డి మిక్స్‌ డ్‌ జెండర్‌ క్రికెట్‌ లో ఆడనున్నట్లు క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

మగవాళ్ల తో అంతర్జాతీయ క్రికెట్ లో మేం దేనికి తీసిపోం అన్న రీతిలో మహిళా క్రికెటర్లు రాణిస్తున్నారు.. 110 నుంచి 130 కిమీ వేగంగా బౌలింగ్ వేసే మహిళా బౌలర్లు - సిక్స్ లు - ఫోర్లతో విరుచుకు పడే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే మహిళా క్రికెటర్ల ఆటను ఈ మధ్యన మనం చూస్తున్నాం.. ఇప్పుడు మిక్స్ డ్ జెండర్ క్రికెట్ తో వండర్ కావడం క్రికెట్ సగటు అభిమాని వంతు కానుంది...

మిక్స్‌ డ్‌ జెండర్‌ క్రికెట్‌ టోర్నీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నాలుగు జట్లను ఎంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌ పోటీలు ముగిసిన తర్వాత జూలైలో ఇంగ్లండ్‌ వేదికగా మిక్స్‌ డ్‌ జెండర్‌ క్రికెట్‌ ని నిర్వహించేందుకు ఆర్‌ సీబీ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News