యూర‌ప్ భార్య కోసం నెహ్రూ అలా చేశార‌న్న స్వామి!

Update: 2019-05-09 06:54 GMT
రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌లు స‌హ‌జ‌మే. దీన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. దేనికైనా హ‌ద్దు ఉండాలి. రాజ‌కీయంగా ఎంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించినా.. స‌ద‌రు నేత మ‌ర‌ణించిన త‌ర్వాత వారిపై విమ‌ర్శ‌లు చేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు. కానీ.. అలాంటి రూల్స్ ను బ్రేక్ చేస్తోంది మోడీ ప‌రివారం.

కాంగ్రెస్ నేత‌ల మీద కంటే కాంగ్రెస్ పార్టీనే ల‌క్ష్యంగా చేసుకున్న మోడీ.. ఆ పార్టీ మూలాల్లోకి వెళ్లి మ‌రీ తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో చీల్చి చెండాడుతున్నారు. కాంగ్రెస్ ఔనిత్యాన్ని.. ఆ పార్టీకి చెందిన నేత‌ల ఇమేజ్ ను డ్యామేజ్ చేయాల‌న్న కార్య‌క్ర‌మాన్ని మోడీ అండ్ కో ఈ మ‌ధ్య‌న మొద‌లెట్టారు.

త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలోనూ.. అంత‌కు ముందు రాజీవ్ గాంధీని.. నెహ్రూను టార్గెట్ చేయ‌ని మోడీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు ల‌క్ష్యంగా చేసుకున్నారు. తీవ్ర‌మైన వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే రాజీవ్ గాంధీపైన తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన మోడీకి కొన‌సాగింపుగా బీజేపీ ఎంపీ (రాజ్య‌స‌భ‌) సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

భార‌తదేశ‌ మొద‌టి ప్ర‌ధాన‌మంత్రి నెహ్రూను ఉద్దేశించి ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ చేస్తూ.. నెహ్రూ త‌న యూర‌ప్ భార్య‌ల్లో ఒక‌రికి వైమానిక ద‌ళ విమానం కావాల‌ని కోరుకున్న‌ట్లు పేర్కొన్నారు. 1950ల‌లో ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శిగా ఉన్న త‌న మామ జేడీ క‌పాడియాను నెహ్రూ కోర‌రాని కోరిక కోరినట్లుగా చెప్పారు. వైమానిక ద‌ళానికి చెందిన విమానాన్ని త‌న యూర‌ప్ భార్య‌కు కేటాయించాల‌ని కోర‌గా.. అందుకు నో చెప్పార‌న్నారు.

దీంతో క‌పాడియాను బ‌దిలీ చేసి.. ఆయ‌న స్థానంలో కూర్చోబెట్టిన కార్య‌ద‌ర్శితో త‌న ప‌నిని పూర్తి చేసిన‌ట్లుగా స్వామి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టికే రాజీవ్ గాంధీని ఉద్దేశిస్తూ మోడీ చేసిన ఆరోప‌ణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజీవ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఐఎన్ ఎస్ విరాటా్ను గాంధీ కుటుంబం ప‌ర్స‌న‌ల్ ట్యాక్సీగా వాడేసుకుందంటూ ఆరోపించారు. ఈ వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు రానున్న రోజుల్లో మ‌రెంత స్థాయికి దిగ‌జార‌తాయో ఏమో?


Tags:    

Similar News