సంచలనాల సుబ్రమణ్య స్వామి అదిరిపోయే సంచలనానికి తెర తీశారు. సీబీఐకి.. ఈడీ అధికారులకు సైతం అందని చిత్ర విచిత్రమైన సమాచారం స్వామికి అందుతుంటుంది.ఆయన నెట్ వర్క్ ఎంత స్ట్రాంగ్.. ఆయన ఆరోపణలు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్నది అక్రమాస్తుల కేసులో జయ.. శశి ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
సంచలన ప్రకటనలు.. ఆరోపణలతో వణుకు పుట్టించే ఆయన.. తాజాగా మాజీ ఆర్థికమంత్రి.. యూపీఏ సర్కారులోకీలకభూమిక పోషించిన చిదంబరం.. ఆయన కుమారుడు కార్తీపైన భారీ బాంబును పేల్చేశారు. చిదంబరం అండ్ సన్స్ కు సంబంధించిన 21 విదేశీ రహస్య బ్యాంకు ఖాతాల వివరాల్ని ప్రకటించి సంచలనం సృష్టించారు.
తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. కార్తీ చిదంబరానికిచెందిన రహస్య బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు.. మరిన్నితీవ్రమైన ఆరోపణల్ని సంధించారు. చిదంబరం కానీ.. ఆయన కుమారుడు కానీ.. విదేశీ రహస్య బ్యాంకు ఖాతాల్ని వెల్లడించలేదని.. ఈ ఖాతాల్ని వారు సీక్రెట్ గా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఈ ఖాతాల్ని రహస్యంగా నిర్వహిస్తున్న విషయాన్ని వెల్లడించిన స్వామి.. ఖాతాల వివరాల్ని బయటపెట్టేశారు.
స్వామి తాజాగా వెల్లడించినబ్యాంకు ఖాతాల్ని.. ఇప్పటివరకూ కార్తీ వెల్లడించింది లేదు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన కార్తీ.. తన నామినేషన్ దాఖలు సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన ఈసీలోనూ ఈ బ్యాంకు వివరాల్ని వెల్లడించకపోవటం గమనార్హం. ఇటీవల ఈ బ్యాంకు ఖాతాల గురించి.. అకౌంట్ల వివరాల్ని తాను ప్రధాని మోడీకి లేఖ రూపంలో తెలియజేసినట్లుగా చెప్పారు. ఎయిర్ సెల్ మాక్సిస్ స్కాంలో పలు ఆరోపణల్ని సంధించిన స్వామి.. చిదంబరం.. ఆయన కుమారుడు కార్తీకి సంబంధించిన పలు సాక్ష్యాల్ని అధికారులకు ఇచ్చినా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ మరో బాంబు పేల్చారు. తాజా వ్యవహారం చూస్తుంటే..చిదంబరానికి..ఆయన కుమారుడికి బ్యాడ్ టైం మొదలైట్లుగా లేదు..?
కార్తీకి రహస్య బ్యాంకు ఖాతాలు కొన్ని ఎందులో ఉన్నాయంటే..
= మొనాకో బార్ల్కేస్ బ్యాంక్
= బ్యాంక్ మెట్రో (కెనడా)
= స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్ (సింగపూర్)
= ఓసీబీసీ
= హెచ్ ఎస్ బీసీ (కెనడా)
= డ్యుయిష్ బ్యాంక్ (ఫ్రాన్స్)
= యూబీఎస్ (స్విట్జర్లాండ్)
= వెల్స్ ఫార్గో బ్యాంక్ (కాలిఫోర్నియా, అమెరికా)
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/