ఆ పత్రికపై పరువు నష్టం.. చంద్రబాబుపైనా కేసుః బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనం ప్రచురించిన ఓ ప్రధాన పత్రికపై పరువు నష్టం దావా వేశానని, వేంకటేశ్వర స్వామిపై చేసిన ఆరోపణలకుగానూ చంద్రబాబు మరో కేసు పెట్టబోతున్నానని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. ఈ మేరకు తిరుపతి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.
టీటీడీ పవిత్రను దెబ్బతీసేలా ఓ ప్రధాన పత్రిక కథనం ప్రచురించిందని, అందువల్ల ఆ పత్రికపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశానని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. అంతేకాకుండా.. ఆ వార్తాకథనం మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉండడంతో క్రిమినల్ కేసు కూడా దాఖలు చేస్తానని చెప్పారు.
ఇంకా.. తిరుమల వేంకటేశ్వర స్వామిపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపైనా తిరుపతి కోర్టులో మరో కేసు వేయబోతున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఇవేకాకుండా.. హైకోర్టులోనూ ఇంకో కేసు వేస్తానన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఈ కేసు ఉంటుందన్నారు. అంతేకాకుండా.. టీటీడీ దేవస్థానాన్ని ప్రభుత్వ అజమాయిషీ నుంచి తొలగించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తమిళనాడులో నటరాజ స్వామి దేవస్థానాన్ని ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటకు తెచ్చినట్టు చెప్పారు సుబ్రహ్మణ్యం స్వామి.
తిరుమల స్వామి గురించి ఆ పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు తనను కాపాడుతారని సదరు పత్రిక భావిస్తోందని అన్నారు. ప్రజల మద్దతు లేక ఏపీ సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కులాలు, మతలా మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.