ఆ సీఎం, కుక్క తోక ఒక‌టేనంట‌

Update: 2016-09-06 13:10 GMT
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మౌనం వీడారు. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజన్‌ పై విమ‌ర్శ‌లతో అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా పార్టీ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం చాలా రోజులుగా నోరు మెదపకుండా ఉన్న స్వామి మ‌రోమారు గాటుగా రియాక్ట‌య్యారు. అదికూడా సీఎం స్థాయి వ్య‌క్తిని కుక్క తోక‌తో పోల్చారు. పైగా స‌ద‌రు సీఎం త‌మ మిత్ర‌ప‌క్షం వ్య‌క్తి కావ‌డం ఆస‌క్తిక‌రం. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి - పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీపై స్వామి ఈ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఓ టీవీ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌ కౌంటర్ తర్వాతి నుంచి కశ్మీర్ అల్లకల్లోలంగా మారిన ప‌రిస్థితుల‌పై స్వామి స్పందించారు. పీడీపీ అధినేత్రి - ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి మెహబూబా ముఫ్తీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ప్ర‌భుత్వాన్ని న‌డిపించే క్ర‌మంలో ఆమె మారుతారని భావించడం వల్లే బీజేపీ పొత్తు పెట్టుకుందని స్వామి త‌మ పార్టీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు. కానీ మెహబూబా ముఫ్తీ కుక్కతోక లాంటి వారని, వాళ్లను సరిచేయడం కుదరని పని అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అందుకే త‌న అభిప్రాయం ప్ర‌కారం ఆమెను సీఎం ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌న్నారు. ముఫ్తీని సీఎంగా ఉంచే బదులుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని త‌ద్వారా ప‌రిస్థితులు క‌దుట‌ప‌డుతాయ‌ని చెప్పారు. బుర్హాన్‌ వ‌నీ ఎన్‌ కౌంట‌ర్ త‌ర్వాత ప‌రిస్థితుల‌ను చక్క‌దిద్దేందుకు చ‌ర్చ‌లు - అఖిల‌ప‌క్ష భేటీలు వంటి రూపంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా ఆ స‌ర్కారులో భాగ‌స్వామ్యం అయిన స్వామి వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.
Tags:    

Similar News