ఎన్ని చేదు అనుభవాలు.. గుణపాఠాలు ఎదురైనా మారని వారు ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు బీజేపీ నేతలు. సమయం.. సందర్భం చూసుకొని మాట్లాడాలన్న కనీస విషయాల్ని పట్టించుకోకుండా మాట్లాడేసి.. లేనిపోని సమస్యల్ని తెచ్చి పెట్టుకోవటం కమలనాథులకు ఒక అలవాటుగా మారింది. ఇప్పటికే పలు సందర్భాల్లో కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు మోడీ సర్కారు ఇమేజ్ ను ఎంతగా డ్యామేజ్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి తప్పే మరొకటి జరిగింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఈ దేశ వ్యాప్తంగా ఎంత కలకలం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఇష్యూపై జాతీయ నాయకులు ఒక్కొక్కరుగా హైదరాబాద్ రావటం.. ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రకటించి.. మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
మోడీ సర్కారు మీద వ్యూహాత్మకంగా సాగుతున్న దాడిగా పలువురు అభివర్ణిస్తున్న ఈ ఉదంతంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మోడీ సర్కారుకు మరింత డ్యామేజింగ్ గా మారతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల్ని ఉద్దేశించి ‘‘కుక్కలు’’గా సుబ్రమణ్య స్వామి అభివర్ణించారు. మరోవైపు ఇదే రోహిత్ ఇష్యూపై మాట్లాడిన ప్రధాని మోడీ.. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. మోడీ ఈ వ్యాఖ్య చేయటానికి కాస్త ముందుగా సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై కమ్యూనిస్టులు వెనుకుండి నడిపిస్తున్నారన్న అర్థం వచ్చేలా విమర్శలు చేసిన స్వామి.. ఆ ఫ్లోలో కుక్కలన్న పదం వాడటం ఇప్పుడు వివాదాస్పదమైంది. మరి.. దీనిపై మరెంత రచ్చ మొదలవుతుందో..?