నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే.. సుబ్రహ్మణ్యం సంచలనం

Update: 2019-08-06 06:54 GMT
కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు చేసి బీజేపీ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా దీనిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై బీజేపీ సీనియర్ నాయకుడు, వివాదాస్పద నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ను విభజించిన బీజేపీ తరువాత అడుగు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్ పై బీజేపీ దూకుడు చూశాక  పీవోకేను  ప్రాంతాన్ని మర్యాదగా భారత్ కు అప్పగించాలని పాకిస్తాన్ ప్రధానిని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాల్సి వచ్చిందని సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడికి కశ్మీరే మిగలలేదంటూ సుబ్రహ్యణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక పీవోకే మనదేనని.. 1996లోనే ప్రధాని పీవీ నరసింహరావు హయాంలోనే పార్లమెంట్ లో ఈ విషయంపై తీర్మానం చేశారని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు.  అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఆర్టికల్ 370ని రద్దు చేయడం బీజేపీ సాహోసేపేత చర్య అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు అభినందలు తెలిపారు. ఇక ఇప్పుడు మోషాల టార్గెట్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమేనని సీరియస్ కామెంట్స్ చేశారు.

    

Tags:    

Similar News