లాడెన్ వీరాభిమాని అయిన తెలుగోడి తెగువ ఇది

Update: 2017-07-08 06:04 GMT
ఒసామా బిన్ లాడెన్‌...ఆల్ ఖైదా అధినేత. ఒక‌ప్పుడు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించి అమెరికా సైన్యం చేతులో తుది శ్వాస విడిచి ప్ర‌పంచ టెర్ర‌రిస్టు. ఐసిస్‌...ఇటీవ‌లి కాలంలో త‌న రాక్షస చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచంలోని కీల‌క దేశాల‌కు కంటి మీద  కునుకు లేకుండా చేస్తున్న ఉగ్ర‌వాద ముఠా. ఎక్క‌డో ఆప్ఘ‌నిస్తాన్‌ - ఇరాక్‌ - సిరియాలో ఉండే ఈ తీవ్ర‌వాద ముఠాలు త‌మ విస్తృతిని పెంచుకుంటూ సానుభూతి ప‌రుల‌ను త‌యారు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అలా ఉగ్ర‌వాదిగా మారిపోయిన వ్య‌క్తే ఇటీవల హైదరాబాద్‌ లో అరెస్టయిన కృష్ణా జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ ముల్లా ఒమర్. పోలీసు కస్టడీలో ఈ తెలుగోడు సంచలమైన అంశాలను వెల్లడించినట్లు స‌మాచారం.

కృష్ణా జిల్లా బందరు సమీపంలోని చల్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం మతం మార్చుకుని ఐసిఎస్‌ లో చేరేందుకు ప్రయత్నిస్తూ పోలీసుల చేతికి చిక్కిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం కోర్టు ఆదేశాలతో పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఒమర్‌ ను విచారించారు. ఈ క్ర‌మంలో పోలీసు వర్గాలకు ఐసిస్ సానుభూతిపరుడు సంచ‌ల‌న విష‌యాల‌ను వెళ్ల‌డించాడని తెలుస్తోంది. ముస్లిం మ‌తం ప‌ట్ల తీవ్రంగా ఆక‌ర్షిస్తుడిని అయిన ప‌విత్ర యుద్ధం (జిహాద్‌) చేసేందుకు తాను పేరు మార్చుకున్న‌ట్లు సుబ్ర‌హ్మ‌ణ్యం అలియ‌స్ ఒమ‌ర్ తెలిపాడు. తాను ముంబాయికి వెళ్లి అక్కడ ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్న ఇద్దరు డాక్టర్ల వద్ద పేలుడు పదార్ధాల తయారీలో శిక్షణ పొందానని చెప్పినట్లు సమాచారం. అలాగే జ‌మ్ముక‌శ్మీర్‌ లోని శ్రీనగర్‌ కు కూడా వెళ్లినట్లు ఆయ‌న పోలీసుల‌కు చెప్పాడు. ఈ సంద‌ర్భంగా మ‌రో సంచ‌ల‌న విష‌యాన్ని సుబ్ర‌హ్మ‌ణ్యం అలియ‌స్ ఒమ‌ర్ వెళ్ల‌డించాడు. తాను ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ కు అభిమానిని అని ఒమర్ పోలీసులకు చెప్పాడు.

కాగా, కోర్టు అనుమతితో కస్టడీలో ఉన్న ఒమర్‌ను ముంబాయికి పోలీసులు తీసుకెళ్లి అక్కడ ఎక్కడ మకాం చేసింది, ఎవరితో మాట్లాడింది, శిక్షణ పొందిన ప్రదేశం వివరాలను తెలుసుకున్నారు. కాగా తమిళనాడు - శ్రీనగర్ - గుజరాత్‌ లో ఒమర్‌ కు ఆశ్రయం ఇచ్చిన వారికి అతనికి ఐఎస్‌ తో లింకులు ఉన్నట్లు తెలియదని సమాచారం. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఒమర్‌ ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
Tags:    

Similar News