దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఢిల్లీ వంటి నగరాల్లో పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉంటోందో తెలిసిందే. దీంతో.. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని కూడా పెంచుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ లో ఇథనాల్ శాతాన్ని 20కి పెంచాలని కూడా చెప్పింది.
ఈ నేపథ్యంలో సోలార్ పవర్ వినియోగం వైపు కూడా కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే.. విజయవాడలోని రైల్వే జంక్షన్ కూడా పర్యావరణ హితంగా మారబోతోంది. ఈ స్టేషన్లోని అన్ని ప్లాట్ పామ్ లపై సౌరశక్తితో కూడిన కాంతిపీడన కవర్ ను ఏర్పాటు చేశారు. అంటే.. సోలార్ సిస్టమ్ అన్నమాట. ఈ రైల్వేస్టేషన్ కు అవసరమైన విద్యుత్ ను సోలార్ ప్యానెళ్ల ద్వారానే అందనుంది.
ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీనివల్ల ఏడాదికి రూ.8 లక్షల మేర కరెంట్ బిల్లు ఆదా కానుందట. అంతేకాకుండా.. ఇతర కరెంట్ అవసరాలు కూడా తీరబోతున్నాయి. ఈ సౌరశక్తి వల్ల కర్బన ఉద్గారాలకు అవకాశం లేకపోవడంతో పర్యావరణ హితమైన స్టేషన్ గా మారబోతోంది.
ఈ ప్రయోగం దేశంలోనే తొలిసారిగా విజయవాడ స్టేషన్లో అమలు చేస్తున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న జంక్షన్లలో విజయవాడ ప్రముఖమైంది. నిత్యం లక్షలాది మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారు. ఇలాంటి స్టేషన్ ను పర్యావరణహితంగ మార్చడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.