ఓపెన్ ఛాలెంజ్‌; జూన్ 1 త‌ర్వాత టీటీడీ ఖాళీ

Update: 2015-05-23 13:58 GMT
తెలంగాణ అధికార‌ప‌క్షానికి.. విప‌క్షానికి మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత ముదురుతోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండు పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల వేడి పెరిగింది. టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై రాజ‌కీయ నిర్భ‌య కేసు పెట్టాలంటూ చిత్ర‌మైన వ్యాఖ్య చేయ‌టం తెలిసిందే.

మ‌రోవైపు.. టీటీడీపీపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్న తెలంగాణ అధికార‌పక్షం నేతలు.. బ‌హిరంగ స‌వాళ్లు విసురుతున్నారు. జూన్ ఒక‌టి త‌ర్వాత తెలంగాణ టీడీపీలో ఎంత‌మంది ఉంటారో చూసుకోవాలంటూ ఎమ్మెల్సీ సుధాక‌ర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. టీఆర్ ఎస్ నేత‌ల్ని కించ‌ప‌రిచేలా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ ఉద్య‌మంలో ఎప్పుడూ పాలు పంచుకోని రేవంత్‌రెడ్డికి టీఆర్ ఎస్ ను విమ‌ర్శించే స్థాయి లేద‌ని వ్యాఖ్యానించిన సుధాక‌ర్‌ర‌రెడ్డి.. త‌మ‌పై చేస్తున్న విమ‌ర్శ‌లు మొత్తం భ‌యంతోనే అని తేల్చారు. టీటీడీపీ స‌భ్యులు చేజారుతార‌న్న భ‌యంతోనే రేవంత్ ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News